E-Paper
Advertisement

మీ జీవిత భాగస్వామికి తెలియకుండా ఈ పనులు చేస్తున్నారా? ఇవి మైక్రో చీటింగ్ లక్షణాలు

మీ జీవిత భాగస్వామికి తెలియకుండా ఈ పనులు చేస్తున్నారా? ఇవి మైక్రో చీటింగ్ లక్షణాలు
Advertisement

చాలామంది దాంపత్య జీవితంలో మోసం అంటే శారీరక సంబంధం మాత్రమే అని భావిస్తారు. కానీ మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని చిన్నచిన్న దొంగచాటు ప్రవర్తనలు కూడా బంధంలో నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి చర్యలనే మైక్రో చీటింగ్ అంటారు. మొదట్లో ఇవి పెద్ద విషయాలుగా అనిపించకపోయినా, కాలక్రమంలో ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన బంధానికి నిజాయితీ, గౌరవం, పారదర్శకత చాలా అవసరం.

1. ఫోన్‌లో మెసేజెస్, లేదా చాట్‌లను దాచడం

ప్రతి ఒక్కరికీ కాస్త ప్రైవెసీ అవసరమే. అయితే భాగస్వామికి తెలియకుండా మెసేజ్‌లను దాచడం అనుమానాలకు దారితీస్తుంది. ఎప్పుడూ ఫోన్‌ను దాచుకోవడం లేదా చాట్‌లను తొలగించడం నమ్మకాన్ని తగ్గిస్తుంది. మీ భాగస్వామి కొన్ని మెసేజ్‌లు చూడకూడదని మీరు భావిస్తే, ఆ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించడం మంచిది.

2. మరో వ్యక్తిని ప్రత్యామ్నాయంగా ఉంచుకోవడం

Advertisement

కొంతమంది రిలేషన్‌లో ఉన్నప్పటికీ మరో వ్యక్తితో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. అవసరమైతే ఆ వ్యక్తిని తమ భార్య లేదా భర్తకు ప్రత్యామ్నాయంగా భావిస్తారు. ఇది వారి దాంపత్య జీవితంలో మానసిక అనుబంధాన్ని తగ్గిస్తుంది. అలాగే భాగస్వామిలో అసురక్షిత భావనను పెంచే అవకాశం ఉంటుంది.

3. మూడో వ్యక్తిని రహస్యంగా ఫ్లర్ట్ చేయడం లేదా ప్రత్యేక్షంగా ప్రశంసించడం

ఇతరులను ప్రశంసించడం తప్పు కాదు. కానీ భాగస్వామికి తెలియకుండా మరో వ్యక్తితో ఫ్లర్ట్ చేయడం సంబంధానికి ప్రమాదకరం కావచ్చు. మీ భాగస్వామి ఎదుట చెప్పలేని మాటలను మరొకరికి చెబితే, అది మైక్రో చీటింగ్‌గా పరిగణించవచ్చు. ఇలాంటి అలవాట్లు నమ్మకాన్ని క్రమంగా బలహీనపరుస్తాయి.

4. వ్యక్తిగత సమస్యలను ఆసక్తి ఉన్న వ్యక్తితో పంచుకోవడం

Advertisement

ప్రతి బంధంలో సమస్యలు రావడం సహజం. సలహా కోసం స్నేహితులతో మాట్లాడడం కూడా సాధారణమే. కానీ మీపై ఆసక్తి ఉన్న వ్యక్తితో పదే పదే వ్యక్తిగత విషయాలు పంచుకుంటే భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. దీంతో మీ భాగస్వామి కంటే ఆ మూడో వ్యక్తిపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి రావచ్చు.

5. సోషల్ మీడియాలో మీరు బ్యాచిలర్‌గా ప్రవర్తించడం

సోషల్ మీడియా కూడా బంధాలపై ప్రభావం చూపుతుంది. వివాహం లేదా సహజీవనం లాంటి రిలేషన్‌లో ఉన్నప్పటికీ సోషల్ మీడియా ప్రొఫైల్ లో మిమ్మల్ని మీరు బ్యాచ్‌లర్‌గా ఉన్నట్లు పోస్టులు పెట్టడం లేదా ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయడం మీ భాగస్వామి మనసును బాధపెట్టవచ్చు. సోషల్ మీడియాలో కూడా నిజాయితీతో వ్యవహరించడం చాలా ముఖ్యం.

Also Read: భార్యభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే సమస్యలు వస్తాయా? సరైన ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?

మైక్రో చీటింగ్‌ను ఎలా నివారించాలి?

భాగస్వామితో మీరు వారి నుంచి ఆశించే విషయాల గురించి స్పష్టంగా మాట్లాడండి. బంధంలో ఏవి ఆమోదయోగ్యమైనవి, ఏవి కాదో ముందుగానే నిర్ణయించుకోండి. అనుమానం కలిగించే విషయాలను దాచకుండా చెప్పండి. ఏదైనా పని చేయడానికి ముందు, అదే పని మీ భాగస్వామి చేస్తే మీరు అంగీకరిస్తారా అని మీరే ఒకసారి ఆలోచించండి.

నిజాయితీతోనే బంధం బలపడుతుంది

చిన్నచిన్న చర్యలే బంధాన్ని బలపరుస్తాయి లేదా బలహీనపరుస్తాయి. నిజాయితీ, పరస్పర గౌరవం, పారదర్శకత ఉంటే నమ్మకం పెరుగుతుంది. ఇద్దరి మధ్య మంచి సంభాషణ అపార్థాలను తగ్గిస్తుంది. ఒక బలమైన సంబంధానికి పరస్పర అవగాహన, విశ్వాసం, ఎప్పుడూ అవసరం.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×