// // Chanakya Niti: ఈ లక్షణాలున్న వ్యక్తులను స్త్రీలు నమ్మకూడదట! -->
E-Paper
Advertisement

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. ఈ లక్షణాలున్న పురుషులను స్త్రీలు అస్సలు నమ్మకూడదట!

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. ఈ లక్షణాలున్న పురుషులను స్త్రీలు అస్సలు నమ్మకూడదట!
Advertisement

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నీతిశాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా ఎన్నో విషయాలను ఈ తరం వాళ్లకి అందజేశారు. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రంలో బంధాలు, బంధుత్వాలే కాకుండా స్త్రీ, పురుషుల గురించి కూడా చాలా విషయాలు తెలిపారు. అలాగే.. స్త్రీలు ఎలాంటి పురుషులకు దూరంగా ఉండాలో కూడా తెలియజేశారు. చాణక్య నీతిశాస్త్రం ప్రకారం.. కొన్ని రకాల వ్యక్తులకు మహిళలు వీలైనంత దూరంగా ఉండాలి. లేకపోతే, వారి జీవితం కష్టాలమయం అవుతుందని ఆయన హెచ్చరించారు. మరి.. చాణక్యుడు ఎలాంటి వారికి దూరంగా ఉండమని చెబుతున్నారో ఇప్పుడు చూద్దామా..

అబద్ధాలు చెప్పే మోసగాళ్లు:

ఎలాంటి బంధాల్లోనైనా నమ్మకం కీలక పాత్ర పోషిస్తుంది. చాణక్యుడి ప్రకారం.. చీటికీ మాటికీ అబద్ధం చెప్పే పురుషులను స్త్రీలు ఎప్పుడూ నమ్మకూడదు. అలాంటి వ్యక్తులు తమ సౌలభ్యం కోసం ఎప్పుడైనా అబద్ధాలను ఆశ్రయిస్తారు. కాబట్టి.. అలాంటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలను పెట్టుకోకూడదని చాణక్యుడి నీతిశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే.. అలాంటి పురుషులు మధురంగా మాట్లాడి మీ నమ్మకాన్ని గెలుచుకుంటారు. కానీ, సమయం వచ్చినప్పుడు మోసం చేయడానికి వెనుకాడరు.

మిమ్మల్ని నియంత్రించేవారు:

Advertisement

ఇప్పటికీ.. చాలామంది పురుషులు స్త్రీలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మహిళల స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించే వారిని చాలా ప్రమాదకరమైన వ్యక్తులని చాణక్యుడి నీతిశాస్త్రం తెలుపుతోంది. ఎందుకంటే.. అలాంటి వ్యక్తులు స్త్రీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు.

దురాశ కలిగిన వ్యక్తులు:

కొంతమంది మగవాళ్లు తమ స్వలాభం కోసం మాత్రమే మహిళలతో సంబంధాలను కొనసాగిస్తుంటారు. చాణక్యుడి నీతి ప్రకారం.. ఇలాంటి స్వార్థపరులకు మహిళలు దూరంగా ఉండాలి. ఎందుకంటే.. మీ కష్ట సమయాల్లో వీళ్లు తోడుగా నిలవరు. మిమ్మల్ని నిజంగా గౌరవిస్తూ.. కష్టకాలంలో తోడుగా ఉండే వ్యక్తులను మాత్రమే నమ్మాలని చాణక్యుడు సూచిస్తున్నాడు.

ప్రతికూల ఆలోచనలు ఉన్నవారు:

Advertisement

మీరు జీవితంలో ఎదుగుతుంటే.. చూసి అసూయపడేవారు లేదా మీ గురించి చెడుగా మాట్లాడే మగవాళ్లకి దూరంగా ఉండాలని చాణక్యుడు సూచిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తుల ప్రతికూల ఆలోచనలు మహిళల ఉత్సాహాన్ని దెబ్బతీయడమే కాక.. నిరాశలోకి నెట్టేస్తాయి. కాబట్టి.. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×