E-Paper
Advertisement

Nitish Kumar: ఎమ్మెల్యే కూడా కాకుండా 20 ఏళ్లుగా సీఎం, ఈసారి కూడా.. నితీష్‌కే పగ్గాలు?

Nitish Kumar: ఎమ్మెల్యే కూడా కాకుండా 20 ఏళ్లుగా సీఎం, ఈసారి కూడా.. నితీష్‌కే పగ్గాలు?
Advertisement

Nitish Kumar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఈసారి కూడా నితీష్ కుమార్ కు బీహార్ పగ్గాలు దక్కే అవకాశం ఉంది. 20 ఏళ్లుగా సీఎంగా ఉన్న నితీష్ కుమార్ రెండు సార్లు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఈసారి కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ పోటీ చేయలేదు. 30 ఏళ్ల క్రితం ఆయన ఎన్నికల్లో గెలిచారు. అయినప్పటికీ నితీష్ కుమార్ సుదీర్ఘ కాలం సీఎంగా ఉన్నారు. మొత్తంగా బీహార్ ఎన్నికల్లో మూడుసార్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయగా, రెండుసార్లు గెలిచారు.

రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యే

రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకుని ఎంపీగా పోటీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నితీష్ ఆరుసార్లు గెలిచారు. 1985లో తొలిసారి నితీష్ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం పదేళ్ల తర్వాత 1995లో బీహార్‌లోని హర్నాట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆ తర్వాత రాజీనామా చేసి ఎంపీగా విజయం సాధించారు. బీహార్ అసెంబ్లీకి ఆయన మొట్టమొదటిసారిగా 1977లో పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1995 తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఇప్పటికీ, నితీష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

నితీష్ కుమార్ సీఎం కానీ ఎమ్మెల్యే కాదు

Advertisement

నితీష్ కుమార్ 2000లో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 8 రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం 2005లో మరోసారి సీఎం అయ్యారు. అప్పటి నుండి 2014 వరకు ఆయన సీఎంగా కొనసాగారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమితో సీఎంగా రాజీనామా చేశారు. ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. సీఎంగా ప్రమాణం చేసిన సమయంలో ఆయన రెండు సభల్లోనూ సభ్యుడిగా లేరు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిచి సీఎం బాధ్యతలు స్వీకరించేవారు.

Also Read: Nitish Kumar: ఈ మున్నాభాయ్ మహా ముదురు.. నితీష్ కుమార్ అలాంటివాడా? మీకు తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్

ఎమ్మెల్సీగా ఉంటూ

Advertisement

చట్టం ప్రకారం సీఎం లేదా మంత్రి పదవికి రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉండాలి. కానీ బీహార్ లో ఎగువ సభగా శాసనమండలి ఉంది. 2012 లో తన పదవీకాలం ముగిసే వరకు నితీష్ కుమార్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా పోటీ తట్టుకోలేక ఎగువ సభకు తిరిగి ఎన్నికయ్యారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. కానీ నితీష్ మాత్రం తనకు ఎగువ సభ అంటే గౌరవం అంటుంటారు. నితీష్ 2018 మూడోసారి, 2024లో నాల్గోసారి శాసన మండలికి తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×