E-Paper
Advertisement

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!
Advertisement

Rules for wearing Rudraksha: రుద్రాక్ష అనేది కేవలం మెడలో వేసుకునే ఒక నెక్లెస్ లేదా ఆభరణం కాదు. సాక్షాత్తు ఆ పరమశివుడి కంటి నీటి బిందువుల నుంచి పుట్టిన అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన వస్తువు ఇది. అందుకే రుద్రాక్షను ధరించే ముందు దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరైన పద్ధతిలో నియమాలు పాటించకుండా.. ఇష్టం వచ్చినట్లు ధరిస్తే జీవితంలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు రుద్రాక్షను ఎలా ధరించాలి ? ధరించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చాలామంది రుద్రాక్షలను ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు భక్తితో వేసుకుంటే.. మరికొందరు స్టైల్ కోసం వేసుకుంటున్నారు. కానీ రుద్రాక్షలో ఉండే పాజిటివ్ ఎనర్జీ మనకు దక్కాలన్నా.. మానసిక ప్రశాంతత కలగాలన్నా కొన్ని నియమాలను అస్సలు బ్రేక్ చేయకూడదు.

Advertisement

1. ధరించే ముందు ప్రాణ ప్రతిష్ట అవసరం:
మార్కెట్లోకి వెళ్లి ఏ రుద్రాక్ష పడితే అది కొనేసి నేరుగా మెడలో వేసుకోకూడదు. రుద్రాక్షను ధరించే ముందు దానికి పవిత్రమైన నదుల నీటితో (గంగాజలం) లేదా ఆవు పాలతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత శివాలయంలో పూజ చేయించి లేదా ‘ఓం నమః మంత్రాన్ని జపిస్తూ ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాతే ధరించాలి.

2. ఆ సమయాల్లో అస్సలు ధరించకూడదు:
మన దైనందిన జీవితంలో కొన్ని సందర్భాలలో రుద్రాక్షను మెడ నుంచి తీసి పక్కన పెట్టాలి.

Advertisement

నిద్రపోయేటప్పుడు.. పడుకునే సమయంలో పొరపాటున రుద్రాక్ష నలిగిపోయే ప్రమాదం ఉంది. పైగా ఆ సమయంలో శరీరం పూర్తిగా పవిత్రంగా ఉండదు కాబట్టి రాత్రి పూట తీసి పూజా గదిలో పెట్టడం మంచిది.

శవయాత్ర లేదా శ్మశానానికి వెళ్ళినప్పుడు: జన్మ-మరణాల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రుద్రాక్షను ధరించకూడదు.

మద్యం, మాంసం తినేటప్పుడు: నాన్-వెజ్ తినేటప్పుడు లేదా మద్యం సేవించేటప్పుడు రుద్రాక్షకు దూరంగా ఉండాలి.

3. ఇతరుల రుద్రాక్షలను వాడకండి:
రుద్రాక్ష అనేది దానిని ధరించిన వ్యక్తి యొక్క శక్తిని గ్రహిస్తుంది. కాబట్టి మీ రుద్రాక్ష మాలను మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు ఇవ్వకూడదు. అలాగే వేరొకరు వాడిన రుద్రాక్షను మీరు అస్సలు ధరించకూడదు. ఎవరి రుద్రాక్ష వారి వద్దే ఉండాలి.

4. శారీరక శుభ్రత చాలా ముఖ్యం:
రుద్రాక్షను ఎల్లప్పుడూ స్నానం చేసిన తర్వాత, శరీరం , మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడే ధరించాలి. మహిళలు నెలసరి సమయంలో రుద్రాక్షను ధరించకపోవడమే మంచిదని పెద్దలు చెబుతారు. ఆ 3-4 రోజులు దానిని పూజా గదిలో పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి.

5. పగుళ్లు ఉన్న రుద్రాక్షలను వాడొద్దు:
రుద్రాక్ష మాలలోని పూసలు ఎప్పుడైనా పగిలిపోయినా.. లేదా ఏదైనా ముక్క విరిగిపోయినా దానిని వెంటనే మార్చేయాలి. దెబ్బతిన్న రుద్రాక్షలను ధరిస్తే నెగటివ్ ఎనర్జీ వచ్చే ఛాన్స్ ఉంది.

రుద్రాక్ష అనేది మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనం. నియమ నిబంధనలకు లోబడి.. పూర్తి నమ్మకంతో దానిని ధరిస్తే పరమశివుడి ఆశీస్సులు, గుండె నిండా ప్రశాంతత లభించడం ఖాయం.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×