Swapna Shastra Dream: నిద్ర అనేది మన శరీరానికి ఎంత విశ్రాంతిని ఇస్తుందో.. మనసులో అంతటి ఆలోచనల ప్రపంచాన్ని సృష్టిస్తుంది. దాన్నే మనం కలలు అంటాం. అయితే.. రాత్రి పూట వచ్చే ప్రతి కలా నిజం కాదు. స్వప్న శాస్త్రం ప్రకారం, మనం నిద్రపోయే సమయాన్ని బట్టి ఆ కలకు ఉండే పవర్ ఆధారపడి ఉంటుంది. రాత్రి ఏ జాములో వచ్చే కలలు నిజ జీవితంలో పక్కాగా జరుగుతాయి, కాలం , మన భవిష్యత్తుపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
రాత్రి పడుకున్నప్పుడు పీడకలలు రావడం, లేదా మనం ఆకాశంలో ఎగురుతున్నట్లు, లాటరీ తగిలినట్లు కలలు రావడం చాలా కామన్. కానీ జ్యోతిష్య శాస్త్రంలో భాగమైన స్వప్న శాస్త్రం ప్రకారం.. కాలం అనేది కలకు చాలా ముఖ్యం.
1. మొదటి జాము (రాత్రి 9 నుంచి 12 గంటల వరకు):
మనం పడుకున్న మొదటి కొన్ని గంటల్లో వచ్చే కలలు మన మనస్సులో ఉండే ఆలోచనల ప్రతిరూపాలు మాత్రమే. రోజంతా మనం దేని గురించి ఆలోచిస్తామో, అవే మనకు కలలో కనిపిస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఈ సమయంలో వచ్చే కలలు నిజమవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటి గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
2. రెండవ, మూడవ జాము (రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు):
మధ్యరాత్రి దాటిన తర్వాత వచ్చే కలలకు కొద్దిగా ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఈ సమయంలో వచ్చే కలలు నిజమవడానికి ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ కలలు మన సబ్-కాన్షియస్ మైండ్ (ఉపచేతన మనస్సు) ఇచ్చే సంకేతాలుగా భావిస్తారు.
3. నాల్గవ జాము – బ్రహ్మ ముహూర్తం (తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు):
ఇక అసలైన మ్యాజిక్ ఇక్కడే జరుగుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి సూర్యోదయానికి ముందు వచ్చే సమయాన్ని ‘బ్రహ్మ ముహూర్తం’ అంటారు. ఈ సమయంలో.. ప్రకృతిలో సాత్విక శక్తి ఎక్కువగా ఉంటుంది.స్వప్న శాస్త్రం ప్రకారం.. ఈ సమయంలో.. వచ్చే కలలు చాలా త్వరగా (వారంలో లేదా నెల రోజుల్లో) నిజమవుతాయి. ముఖ్యంగా.. ఈ టైమ్‌లో కలలో దేవుళ్లు, పితృదేవతలు లేదా పచ్చటి ప్రకృతి కనిపిస్తే.. మీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం.
జీవితంపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది?
కలలు అనేవి రాబోయే.. కాలానికి ముందస్తు హెచ్చరికలు లేదా శుభ సంకేతాలు లాంటివి. ఒకవేళ మీకు తెల్లవారుజామున ఏదైనా నెగటివ్ లేదా భయానకమైన కల వస్తే.. వెంటనే భయపడకుండా దేవుడిని స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ కల యొక్క నెగటివ్ ఎఫెక్ట్ మీ జీవితంపై పడకుండా ఉంటుంది. అలాగే.. ఉదయం వచ్చిన మంచి కలలను ఇతరులతో షేర్ చేసుకోకపోవడమే మంచిదని పెద్దలు చెబుతారు.