E-Paper
Advertisement

OTT Movie : మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన 7000 కోట్ల మూవీ… ఇంకా చూడలేదా ?

OTT Movie : మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన 7000 కోట్ల మూవీ… ఇంకా చూడలేదా ?
Advertisement

OTT Movie : ‘జురాసిక్‌ పార్క్‌’ ఈ పేరు వింటేనే డైనోసరస్ లు గుర్తుకు వస్తాయి. 1993 లో స్పీల్ బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అప్పటి జైత్రయాత్ర ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. 2025 జూలై 2న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ‘జురాసిక్‌ వరల్డ్‌: రీబర్త్‌’ సినిమా 7500 కోట్ల కలెక్షన్స్‌ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియాలో ఏకంగా 100 కోట్లతో రికార్డ్ సృష్టించింది. ఇది జురాసిక్ పార్క్ సినిమాల‌ ఫ్రాంచైజీలో ఏడవ చిత్రంగా, 2022లో వ‌చ్చిన ‘జురాసిక్ వరల్డ్ డొమినియన్‌’ కు సీక్వెల్‌గా వచ్చింది. ఈ సినిమా ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ ఇది వరకే అమెజాన్‌ ప్రైమ్‌ లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే నవంబర్‌ 14 నుంచి మరో ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ ఓటీటీ పేరు ? దీని కథ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో అంటే

గారెత్ ఎడ్వర్డ్స్ ‘జురాసిక్‌ వరల్డ్‌: రీబర్త్‌’ (Jurassic World : Rebirth) సినిమాకి దర్శకత్వం వ‌హించాడు. ఈ సినిమాలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ లీడ్ రోల్స్ లో నటించారు. 2025 జూలై 2న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో ఆగ‌స్టు 5 నుంచి రెంటల్ పద్దతిలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నవంబర్‌ 14 నుంచి జియో హాట్ స్టార్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ భాషల్లో ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

‘జురాసిక్ వరల్డ్ : డొమినియన్‌’ తర్వాత 5 ఏళ్లకు, డైనోసార్లు ప్రపంచంలో 0.001% మాత్రమే మిగిలి ఉంటాయి. అవి కేవలం అమెజాన్, ఆఫ్రికా, పసిఫిక్ ఐలాండ్స్ లోనే జీవిస్తుంటాయి. అయితే వీటిలో పెద్ద డైనోసార్లు ఒక అరుదైన ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తుంటాయి. ఇది క్యాన్సర్ లాంటి డిసీజెస్‌ని పూర్తిగా నయం చేసే ఔషధానికి కీలకంగా ఉంటుంది. ఒక ఫార్మా అధినేత మార్టిన్ క్రెబ్స్ ఒక టాప్-సీక్రెట్ మిషన్ ప్లాన్ చేస్తాడు. జోరా బెనెట్ ఒక ఎక్స్‌పర్ట్ ని హైర్ చేసి, 6 మందితో టీమ్‌ని లీడ్ చేయిస్తాడు.

Read Also : గర్భిణీలే ఈ సైకో టార్గెట్… పోలీస్ భార్యను కూడా వదలకుండా… ఇంటెన్స్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Advertisement

వాళ్లు పసిఫిక్‌లోని ఒక ఐలాండ్ కి హెలికాప్టర్‌లో ల్యాండ్ అవుతారు. అక్కడి డైనోసార్లు ఇప్పుడు సాధారణం కంటే పెద్దవిగా, క్రూరంగా ఉంటాయి. వాటి డిఎన్ఏ తీసుకునే క్ర‌మంలో త‌న‌తో పాటు వ‌చ్చిన ఆఫీస‌ర్ చేసిన ఒక మిస్టేక్ వల్ల డైనోసార్లు వీళ్ళ మీద దాడి చేయడం మొద‌లు పెడ‌తాయి. దీంతో ఆ టీమ్ ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది. వీళ్ళంతా అక్క‌డి నుంచి బయట పడతారా ? డిఎన్ఏ సాంపుల్స్ తీసుకుంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×