Raju weds Rambai Hero : ఈమధ్య చిన్న సినిమాలతో బాగా పాపులాటిని తెచ్చుకుంటున్నారు సినిమా హీరోలు.. ఒకే ఒక సినిమాతో స్టార్ హీరో రేంజ్కి వెళ్తారు.. అయితే ఎంత ఫాస్ట్గా క్రేజ్ ని సంపాదించుకుంటారో.. అంతే ఫాస్ట్ గా చిన్న విషయానికి తమ ఇమేజ్ ని డామేజ్ చేసుకుంటున్నారు.. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి హీరో పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆన్లైన్ డెలివరీ బాయ్ పై ఆయన దాడి చేశారంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. అసలేం జరిగింది? హీరో ఎందుకు డెలివరీ బాయ్ పై దాడి చేశాడు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాలకు వెళ్లి తెలుసుకుందాం…
‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో నటించిన హీరో అఖిల్ రాజ్ ఒక ఫుడ్ డెలివరీ భాయ్ పై భౌతికంగా దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియో తీవ్ర కలకలం రేపుతుంది. ఆ వీడియోలో.. రాంగ్ అడ్రస్‌కు పార్సిల్ తీసుకువచ్చాడనే నెపంతో సదరు హీరో, అతని కుటుంబ సభ్యులు డెలివరీ బాయ్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ డెలివరీ బాయ్ వీడియోలో తెలిపాడు. అందులో డెలివరీ బాయ్ పై బూతులు తిట్టినట్లు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. తానేదో పొరపాటున రాంగ్ అడ్రస్‌కు ఆర్డర్ తీసుకువచ్చినందుకు క్షమాపణలు చెప్పినప్పటికీ, నా కుటుంబ సభ్యులు తనపై తీవ్రంగా తిడుతూ దాడి చేశారని, నేను సారీ చెప్పినా కూడా నన్ను కొట్టడానికి ఎలా వస్తారు? ఆవేదన వ్యక్తం చేశారు.. బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకు వస్తున్న సమయంలో సదరు హీరో డెలివరీ బాయ్ వైపు దూసుకురావడం, అతనిని కొట్టడానికి కూడా ప్రయత్నించినట్లు వీడియోలో చూస్తే అర్థమవుతుంది.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం హీరో మాత్రం వివాదంలో చెప్పుకున్నట్లు తెలుస్తుంది.. ఆ వీడియో పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి..
#RajuWedsRambai Movie hero #AkhilRaj beats a delivery boy. pic.twitter.com/fZEQKbhAA2
— Milagro Movies (@MilagroMovies) June 29, 2026
ఈ మధ్య కాలంలో హీరోల గురించి ఏదోక వార్త వినిపిస్తూనే ఉంది.. కొందరు అనుకోకుండా చేసిన పొరపాట్లు వివాదంగా మారుతున్నాయి.. మరికొంతమంది కోపంలో విచక్షణ కోల్పోయి చేస్తుంటారు. అవే ఇప్పుడు ట్రోల్స్ వేయించుకొనేలా చేస్తున్నాయి.. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ మెడకు ఓ వివాదం చుట్టుకుంది.. ఒక డెలివరీ బాయ్ పై హీరో దాడి చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఒక వీడియో కూడా వైరల్ అవడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాతో పాటుగా ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.. ఈ వీడియో పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ఉండాల్సిన హీరోలు ఇలా దాడులు చేయడం ఏంటి అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఈ హీరో ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈయన నటించిన మొదటి సినిమా రాజు వెడ్స్ రాంబాయి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇతని చేతిలో మరో భారీ ప్రాజెక్టు ఉన్నట్లు తెలుస్తుంది..