E-Paper
Advertisement

Farm Pond: మేకను కాపాడబోయి.. నీటిలో పడి మహిళ మృతి!

Farm Pond: మేకను కాపాడబోయి.. నీటిలో పడి మహిళ మృతి!
Advertisement

Farm Pond: స్వేచ్ఛ బ్యూరో: బచ్చన్నపేట మండలం మొండికుంట సమీపంలోని వ్యవసాయ నీటి కొలనులో ప్రమాదవశాత్తు పడి చిన్నరామంచర్ల గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో గుర్రాల నర్సిరెడ్డికి చెందిన వ్యవసాయ నీటి కొలనులో పడిన మేకను బయటకు తీసేందుకు యత్నించిన గుండా వాణి (33), భర్త ఉపేందర్, ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయింది. ఈత రాకపోవడంతో నీట మునిగి అక్కడికక్కడే మృతి చెందింది.

Also read: Murder Case: ప్రియుడితో కలిసి భార్య దారుణం.. నిద్రిస్తున్న భర్తపై రుబ్బురోలు రాయితో దాడి..!

కేసు నమొదుచేసిన పోలీసులు..

Advertisement

మృతురాలు కురుమ కులస్థురాలని, వ్యవసాయ కుటుంబానికి చెందినదని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న బచ్చన్నపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బచ్చన్నపేట ఎస్ఐ తెలిపారు. నీటి కొలనులు, చెరువులు, కాలువల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈత రానివారు ఒంటరిగా నీటిలో దిగవద్దని పోలీసులు హెచ్చరించారు.

Also read: ఎయిర్‌పోర్టు నుంచి నిధుల వరకు… కేంద్రం సమాధానం చెప్పాలి- మంత్రి పొన్నం

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×