E-Paper
Advertisement

AP Legislative Council: బొత్స vs పార్థసారధి.. మండలిలో వాడీ వేడీ చర్చ.. నేతల మధ్య తీవ్ర వాగ్వాదం

AP Legislative Council: బొత్స vs పార్థసారధి.. మండలిలో వాడీ వేడీ చర్చ.. నేతల మధ్య తీవ్ర వాగ్వాదం
Advertisement

AP Legislative Council: అంధ్రప్రదేస్ శాసన మండలి సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సంక్షేమ పథకాలు తమ హయంలోనే బాగా జరుగుతున్నాయంటూ ఇరు పార్టీలు సవాళ్లు విసుకురుంటున్నాయి. ఈ క్రమంలోనే మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), టీడీపీ మంత్రి పార్థసారధి (Kolusu Partha Sarathy) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

బొత్స సవాల్ ఏంటంటే?

గవర్నల్ ప్రసంగంలో అన్నదాత సుఖీభవ పథకానికి (Annadata Sukhibhava Scheme) రూ.20,000 ఇచ్చినట్లు చెప్పడాన్ని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. అది నిజమని రుజువు చేస్తే బహిరంగ క్షమాపణ చెబుతామని బొత్స సత్యనారాయణ ఛాలెంజ్ విసిరారు. అంతేకాకుండా వసతి దీవెన నిధులను ఇంతవరకూ విడుదల చేయలేదని, ప్రైవేటు ఆస్పత్రులు.. ఆరోగ్యశ్రీని అనుమతించడం లేదని బొత్స మండిపడ్డారు. తాము సభను తప్పుదోవ పట్టించడం లేదని.. ఒకవేళా దీనిని అధికార పక్షం రుజువు చేస్తే తమ మాటలు వెనక్కి తీసుకొని సారీ చెబుతామన్నారు.

మంత్రి పార్థసారధి కౌంటర్..

Advertisement

మరోవైపు బొత్స సత్యనారాయణ విసిరిన ఛాలెంజ్ పై గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారధి స్పందించారు. ఆయన సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. తల్లికి వందనం నిధులు అరకొరగా పడ్డాయన్న బొత్స ఆరోపణలను ఆయన ఖండించారు. నియోజకవర్గం, జిల్లాల వారీగా దీనిని రుజువు చేసే పత్రాలు సమర్పిస్తే.. తాను ఏ శిక్షకైనా సిద్ధమని ప్రతి సవాలు విసిరారు. 48 లక్షల మందికి అన్నదాత సుఖీభవ నిధులు ఇస్తే.. ఒక్కరికి కూడా పడలేదని బొత్స అనడం సరైంది కాదన్నారు. ‘నేను ఛాలెంజ్ చేస్తున్నా. రండి చెక్ చెద్దాం’ అంటూ బొత్సకు సూచించారు.

Also Read: CM Revanth In Delhi: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్, కేంద్రమంత్రులతో భేటీ, ప్రాజెక్టులు.. ఆపై నిధులపై చర్చ

పింఛన్ల విషయంలోనూ రగడ

Advertisement

అంతకుముందు పెన్షన్లపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రసంగంపై కూడా బొత్స విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లపై అనుమానం వ్యక్తం చేశారు. 19 నెలల కాలంలో 60 ఏళ్లు నిండినవారికి ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? తాము పెట్టిన ఎలిజిబులిటీ రూల్స్‌ని ఏమైనా మార్పులు చేశారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రిప్లై ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో ఏ ఒక్క పెన్షన్ తొలగించలేదన్నారు. 4 లక్షల 70 వేల మంది మరణిస్తే.. సుమారు 2 లక్షల 70 వేల మందికి పెన్షన్లు ఇచ్చామన్నారు. ప్రస్తుతం 63 లక్షల 20 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: AP Budget Session: పవన్‌తో నాగబాబు, బాలయ్య భేటి.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×