E-Paper
Advertisement

Social Boycott: ఛీ.. ఛీ.. ఇదేం సమాజం? చనిపోయిన వ్యక్తిపై కూడా కుల వివక్షా?

Social Boycott: ఛీ.. ఛీ.. ఇదేం సమాజం? చనిపోయిన వ్యక్తిపై కూడా కుల వివక్షా?
Advertisement

Social Boycott: మానవ సేవే మాధవ సేవ అని మన పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరుగుతున్నంత వేగంగా మనుషుల్లోని మానవత్వం మాత్రం పెరగడం లేదు. విజ్ఞానంతో మనిషి చంద్రుడిని చేరుకుంటున్నాడే తప్ప, పక్కనున్న తోటి మనిషిని చేరుకోలేకపోతున్నాడు.

కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికీ కులం పేరుతో వ్యక్తులను సామాజికంగా వెలివేసే దురాచారాలు కొనసాగుతున్నాయి. మనిషి బ్రతికున్నప్పుడు ఎలాగోలా దూరంగా పెట్టినా.. కనీసం మరణించిన తర్వాత కూడా ఆ పగలను వదలకపోవడం అత్యంత బాధాకరం. కుల బహిష్కరణ కారణంగా మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవరూ రాకపోవడం, కడసారి వీడ్కోలు పలకడానికి సైతం మనసు రాకపోవడం సమాజం ఎంతగా దిగజారిపోయిందో తెలియజేస్తోంది. అలాంటి ఘటనే ఇప్పుడు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో చోటుచేసుకుంది.

Advertisement

కందనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశం కుటుంబాన్ని గత కొంతకాలంగా గ్రామ పెద్దలు కుల బహిష్కరణ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజేశం అనారోగ్యంతో మరణించాడు. సాధారణంగా గ్రామంలో ఎవరైనా చనిపోతే ఇరుగుపొరుగు, కులస్థులు వచ్చి అంత్యక్రియల్లో సాయం చేయడం ఆనవాయితీ. కానీ.. ఈ కుటుంబంపై ఉన్న బహిష్కరణ వేటు కారణంగా గ్రామస్థులు ఎవరూ రాజేశం మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదు.

కడచూపు చూసేందుకు కానీ.. పాడె మోసేందుకు కానీ ఎవరూ రాకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర క్షోభకు గురైంది. కన్నీరుమున్నీరవుతూనే.. చేసేదేమీ లేక రాజేశం భార్య, కుమారులు ,ఇతర కుటుంబ సభ్యులే స్వయంగా పాడెను భుజాన వేసుకున్నారు. ఊరేగింపుగా మృతదేహాన్ని శ్మశానానికి తరలించారు. ఒక వ్యక్తి మరణించిన వేళ సానుభూతి చూపాల్సింది పోయి.. ఇలా అమానవీయంగా వ్యవహరించడం స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

ఈ విషాదకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సమాజంలోని వివక్షపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చట్టం ప్రకారం కుల బహిష్కరణ నేరమని తెలిసినా.. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం శోచనీయం. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.

Also Read: పిచ్చి పిచ్చి స్టేటస్‌లు పెడితే కుదరదు.. కొలికిపూడిపై పల్లా శ్రీనివాస్ ఫైర్

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×