E-Paper
Advertisement

Lava Mobiles: లావా సరికొత్త యాడ్.. మొబైల్ సర్వీస్ సెంటర్లపై అదిరిపోయే సెటైర్, నవ్వకుండా ఉండలేరు

Lava Mobiles: లావా సరికొత్త యాడ్.. మొబైల్ సర్వీస్ సెంటర్లపై అదిరిపోయే సెటైర్, నవ్వకుండా ఉండలేరు
Advertisement

Lava Mobiles: ఎంతో ఇష్టంగా మనకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను వేలకు వేలు డబ్బులు పెట్టి కొనేటప్పుడు ఉండే ఆనందం.. అది రిపేర్‌కు వచ్చినప్పుడు ఉండదు. ముఖ్యంగా ఫోన్ రిపేర్ కోసం సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సి వస్తే.. అదో పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకుంది స్వదేశీ బ్రాండ్ లావా. పెద్ద పెద్ద గ్లోబల్ బ్రాండ్ల సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగలేక విసిగిపోయిన యూజర్ల కష్టాలను కళ్లకు కడుతూ, అదిరిపోయే రేంజ్‌లో ఓ యాడ్‌ను రూపొందించింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సర్వీస్ సెంటర్ అంటే సర్కస్సేనా?

ఈ యాడ్‌లో చూపించిన సీన్లు చూస్తుంటే.. ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ ‘అరే.. ఇలా నాక్కూడా జరిగింది!’ అని నవ్వుకోకుండా ఉండలేరు. ఒక పెద్ద బ్రాండ్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లిన కస్టమర్ అక్కడ పడేపాట్లు, ఆ గందరగోళం చూస్తుంటే అదొక సర్కస్‌ను తలపిస్తుంది. టోకెన్ నంబర్ కోసం గంటల తరబడి వెయిట్ చేయడం, అక్కడి సిబ్బంది చెప్పే వింత సాకులు, చివరికి కస్టమర్ వయసు పెరగడంతో అక్కడే సీట్లో కూర్చునే చనిపోవడం.. ఇలా ప్రతి విషయాన్ని లావా తన యాడ్‌లో చాలా ఫన్నీగా, అంతే ఘాటుగా విమర్శించింది.

Advertisement

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ ట్యాబ్లెట్ ధర ఇంత తగ్గిందా? యాపిల్ వాచ్‌పై కూడా క్రేజీ డీల్!

గ్లోబల్ దిగ్గజాలకు గట్టి కౌంటర్..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజాలు చైనా, సౌత్ కొరియా కంపెనీలు ఫోన్లు అమ్మేటప్పుడు చూపించే ఉత్సాహం, రిపేర్ అని వెళ్తే చూపించవు అనే నిజాన్ని లావా బట్టబయలు చేసింది. ‘మీ జేబులో డబ్బులు ఉన్నంత వరకే మీకు మర్యాద.. ఫోన్ పాడైతే మాత్రం మీరు ఎవరో మాకు తెలియదు’ అన్నట్లుగా వ్యవహరించే గ్లోబల్ బ్రాండ్ల తీరుపై సెటైర్లు వేసింది. ఈ సర్వీస్ సెంటర్ సర్కస్ నుంచి కస్టమర్లను కాపాడేందుకే తాము ఉన్నామని తాజా యాడ్ ద్వారా లావా గట్టిగా చెప్పినట్లైంది.

ఇక నుంచి ఇంటి వద్దే సర్వీస్..

Advertisement

యాడ్ ద్వారా ఈ రచ్చ అంతా చేసిన లావా.. చివర్లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. తమ Agni, Blaze సిరీస్ ఫోన్ల కోసం Service at Home ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అంటే.. ఇక నుంచి మీ ఫోన్ పాడైతే, సర్వీస్ సెంటర్ మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, టెక్నీషియన్ నేరుగా మీ ఇంటికే వస్తారు. No Questions Asked (ప్రశ్నలు అడగకుండానే) రీప్లేస్‌మెంట్ లేదా రిపేర్ చేస్తామని హామీ ఇస్తోంది సంస్థ. మొత్తానికి ఈ యాడ్ ద్వారా కస్టమర్ పల్స్ పట్టుకున్న బ్రాండ్‌గా లావా తన మార్క్ చూపిస్తోంది కదా.

Also Read: ఐఫోన్ లుక్.. నథింగ్ ఫీచర్లు.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

మీరూ చూస్తారా మరి ఆ వీడియో..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×