E-Paper
Advertisement

Minister Sandhyarani: మంత్రి సంధ్యారాణి కుమారుడు, పీఏ వ్యవహారంలో ట్విస్ట్.. మినిస్టర్ కుమారుడిపై నో FIR

Minister Sandhyarani: మంత్రి సంధ్యారాణి కుమారుడు, పీఏ వ్యవహారంలో ట్విస్ట్..  మినిస్టర్ కుమారుడిపై నో FIR
Advertisement

మంత్రి పీఏ సతీష్ మోసం చేశాడని ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. తన ఫ్రెండ్స్ కోరిక తీర్చమని మంత్రి కుమారుడు పృథ్వీ చెప్పాడంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. తన ఫ్రెండ్స్ నిన్ను ఇష్టపడుతున్నారని వాళ్ల దగ్గరకు వెళ్లమంటున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య చాట్ నెట్టింట వైరల్ అవుతోంది.
అటు పీఏ, ఇటు మంత్రి కుమారుడు ఇద్దరూ తనను వేధిస్తున్నారనే విషయాన్ని నేరుగా మంత్రి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లినా ఆమె కూడా తననే తిట్టిందని ఆరోపించింది బాధితురాలు. నా పీఏ మీదే ఫిర్యాదు చేస్తావా..? అంటూ మంత్రి సంధ్యారాణి తనను వేరే చోటుకు ట్రాన్స్‌ఫర్ చేయించి ఇబ్బంది పెట్టారని కన్నీరు పెట్టుకుంది.

మరోవైపు మంత్రి పీఏ సతీష్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని తన దగ్గర లక్షల రూపాయల డబ్బులు తీసుకుని తనని వేధిస్తున్నాడని ఆరోపించింది బాధితురాలు. అతని బర్త్ డే రోజు మద్యం సేవించి వచ్చి తనకు బర్త్ డే గిఫ్ట్ కింద తనతో గంట పాటు గడపాలంటున్నాడని చెబుతోంది ఆరోపించింది. తన కోరిక తీర్చడమే గాక తాను చెప్పిన టీడీపీ నేతల దగ్గరకు వెళ్లాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

మంత్రి కొడుకు తన స్నేహితుల దగ్గరకు వెళ్లమని చెబితే.. మంత్రి పీఏ టీడీపీ నేతల దగ్గరకు వెళ్ళమంటున్నాడని గోడు వెల్లబోసుకుంది. తనకు సాయం చేసిన వారిపైనా సతీష్ దాడులు చేస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బాధితురాలు మన్యం జిల్లా ఎస్పీకి మంత్రి పీఏ, మంత్రి కుమారుడిపై ఫిర్యాదు చేసింది..

తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు మంత్రి పీఏ సతీష్. ఈ వ్యవహారం కక్ష పూరితమైనదని తెలిపాడు. మంత్రి సంధ్యారాణిని రాజకీయంగా దెబ్బతీయడానికి తనను పావుగా వాడుకుంటున్నారని పేర్కొన్నాడు. మంత్రి తనయుడిని కూడా బ్యాడ్ చేయాలని చూస్తున్నారన్నాడు. ఆ మహిళ చెప్పిందంతా అబద్ధమన్నాడు. ఫోన్లు హ్యాక్ చేసి.. వాట్సప్ చాటింగ్ పేరుతో నిందలు వేయాలని చూస్తున్నారన్నాడు. త్వరలోనే నిజాలన్నీ బయట పెడతానన్నాడు మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్.

Advertisement

ALSO READ: OTT Movie: నటి ప్రైవేట్ వీడియోలు లీక్… అపరిచితుడి ఉచ్చులో నరకం… క్లైమాక్స్ వరకూ ఉత్కంఠే

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×