E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిల వరుస హత్యలు… ఆఫీసర్లకు దొరకని క్లూ… ఓటీటీలోకి మలయాళ హారర్ థ్రిల్లర్‌

OTT Movie : అమ్మాయిల వరుస హత్యలు… ఆఫీసర్లకు దొరకని క్లూ… ఓటీటీలోకి మలయాళ హారర్ థ్రిల్లర్‌
Advertisement

OTT Movie : హారర్ థ్రిల్లర్‌ జానర్ లో గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన ‘L’ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. కేరళలోని వివిధ ప్రాంతాలలో మహిళల అనుమానాస్పద మరణాల ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ స్టోరీ ఇన్వెస్టిగేషన్ లో ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఏడాది తరువాత ఇప్పుడు థ్రిల్లర్ ఆడియన్స్ ని పలకరిస్తోంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

షోజి సెబాస్టియన్ దర్శకత్వం వహించిన ‘L’ చిత్రం గత సంవత్సరం థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం 2025 నవంబర్ 27 నుంచి మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విష్ణు, అమృత మీనన్, బిగ్ బాస్ ఫేమ్ సంధ్యా మనోజ్, జోషి కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. షెల్లీ జాయ్ ఎల్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉండనుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కేరళలోని వివిధ ప్రాంతాల్లో ఆడవాళ్లు ఒక్కొక్కరుగా మిస్టీరియస్‌గా చనిపోతుంటారు. ఆధారాలు మాత్రం ఏమీ దొరకడం లేదు. కానీ ఇన్వెస్టిగేషన్ లో ఒక క్లూ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అన్ని మరణాలూ 1980ల్లో హంగరీలో జరిగిన ఒక సీరియల్ కిల్లింగ్స్‌తో ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంటాయి. సీబీఐ ఆఫీసర్ విష్ణు (విష్ణు ఉన్నికృష్ణన్) కేసు తీసుకుని, IG రేణుక (అమృతా మెనన్)తో కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. స్టోరీ నడుస్తున్న కొద్ది మరింత భయంకరమైన ట్విస్ట్ వస్తుంది.

Read Also : ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో… ఓటీటీలోకి జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ మరణాల వెనక ఉన్నది మనిషి కాదు, ఒక సూపర్‌ నాచురల్ శక్తి ఉందని తెలుస్తుంది. 1980ల హంగరీ కేసు దీంతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తుంది. అది ఇప్పుడు కేరళకి వచ్చి మహిళల్ని టార్గెట్ చేస్తోంది. విష్ణు, రేణుక, అర్జున్ టీమ్ కలిసి ఆ శక్తిని ఫేస్ చేస్తారు. ఇక చివరి అరగంట సినిమా భయంకర మలుపులు తీసుకుంటుంది. వీళ్ళు ఆ సూపర్‌ నాచురల్ శక్తిని ఎలా ఆపారు ? దాని గతం ఏమిటి ? ఎందుకు ఇప్పుడు ఆడవాళ్ళని టార్గెట్ చేస్తుంది ? అనే మైండ్ బ్లోయింగ్‌ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×