E-Paper
Advertisement

Akhanda 2 pre Release: అఖండ 2 సినిమాకు రావడం అంటే గుడికి వచ్చినట్టే..

Akhanda 2 pre Release: అఖండ 2 సినిమాకు రావడం అంటే గుడికి వచ్చినట్టే..
Advertisement

Akhanda 2 pre Release: బాలకృష్ణ అఖండ 2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు .తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా  ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా విడుదల చేసిన టీజర్ కూడా భారీ స్థాయిలో సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ రామ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఉగ్రరూపం చూస్తారు..

బాలకృష్ణ గారు ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారని సాక్షాత్తు ఆ పరమశివుడే ఆయనను ఆహ్వానించి నటించారేమో అన్న విధంగా ఉగ్రరూపం చూపించారని రామ్ తెలిపారు. ఇటీవల కాలంలో మనుషులు చాలా పాపాలు చేస్తున్నారు అలాంటివారిని మార్చడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రావాలని రామ్ తెలిపారు. ఈ అఖండ సినిమా వేడుకలో పాల్గొని ఉంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలాగా లేదని , ఒక గుడికి వచ్చాము అనే భావన నాకు కలుగుతుందని రామ్ తెలిపారు.

గుడికి వెళ్ళామనే భావన..

Advertisement

ఇలా సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఎంతో గొప్పగా ఈ సినిమాలో చూపించారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాకు వచ్చి సినిమా చూడాలని కోరారు. అఖండ సినిమా చూడటం కోసం థియేటర్ కు వెళ్తే సినిమా చూసి వచ్చాము అనే భావన ప్రేక్షకులకు ఉండదు ఒక గుడికి వెళ్ళాము అనే భావన ప్రేక్షకులలో కలుగుతుంది అంటూ ఈ సినిమా గురించి ఫైట్ మాస్టర్ రామ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి భారీ ఎలివేషన్స్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సనాతన ధర్మ పరిరక్షణ ..

Advertisement

ఇక ఈ సినిమా సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించగా ఒక పాత్రలో సనాతన ధర్మ పరిరక్షకుడిగాను అలాగే ఎమ్మెల్యేగా కూడా మరొక పాత్రలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించక ఈ సినిమాని 14 రీల్స్ బ్యానర్ పై గోపి అచంట, రామ్ అచంట నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ నటించిన మొట్టమొదటి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి అఖండ 2 సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుండగా డిసెంబర్ 4నే ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి.

Also Read: BMW film: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్.. రేపే ప్రోమో!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×