// // Ram Mohan Naidu: అమ్మ పేరిట మొక్క.. ప్రధాని మోడీకి రామ్మోహన్ నాయుడు మాతృమూర్తి అద్భుత కానుక! -->
E-Paper
Advertisement

అమ్మ పేరిట మొక్క.. ప్రధాని మోడీకి రామ్మోహన్ నాయుడు మాతృమూర్తి అద్భుత కానుక!

అమ్మ పేరిట మొక్క.. ప్రధాని మోడీకి రామ్మోహన్ నాయుడు మాతృమూర్తి అద్భుత కానుక!
Advertisement

Ram Mohan Naidu: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తన కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన ఒక ప్రత్యేక సందర్భాన్ని ఎంతో భావోద్వేగంతో పంచుకున్నారు.

‘ఢిల్లీ వేదికగా ఈ రోజు మా కుటుంబ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని, గుండెల్లో పదిలంగా దాచుకునే ఒక అద్భుతమైన భావోద్వేగ క్షణం ఆవిష్కృతమైంది. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని నా కుటుంబ సభ్యులందరితో కలిసి కలిసే మహద్భాగ్యం దక్కడం ఎంతో సంతోషాన్ని, అంతకు మించి గర్వాన్ని ఇచ్చింది’.

Advertisement

ఆయనలోని అసాధారణమైన వ్యక్తిత్వం, అందరినీ ఆత్మీయంగా పలకరించే తీరు మా కుటుంబంలోని మూడు తరాల వారిని ఒక్కసారిగా కట్టిపడేసాయి. దేశ ప్రజల హృదయాల్లో ఆయనకు ఎందుకు అంతటి అపారమైన గౌరవం, ఆదరణ ఉన్నాయో ఆయన్ని అంత దగ్గరగా చూసిన ఆ క్షణంలో మాకు మరింత స్పష్టంగా అర్థమైంది.

ఈ భేటీలో అన్నింటికన్నా మధురమైన ఘట్టం మరొకటి ఉంది. ప్రధాని మోడీ గారు పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరిట ఒక మొక్క) అనే గొప్ప ఆలోచనకు స్ఫూర్తిగా.. మా అమ్మగారు స్వయంగా ప్రధానమంత్రికి ఒక మొక్కను బహుమతిగా అందించారు. ఇది మా కుటుంబం మొత్తానికి ఎంతో గర్వకారణంగా, జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

Advertisement

మాపై ఆయన చూపించిన ఆ ప్రేమ, ఆప్యాయత, అందించిన ఆశీస్సులు ఎప్పటికీ వెలకట్టలేనివి. దేశ ప్రధానిగా ఎంతో బిజీగా ఉంటూనే, మా కోసం తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి, మాతో గడిపినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి గారూ.. లాయర్ కుటుంబానికి రక్షణ కల్పించండి.. అసదుద్దీన్ డిమాండ్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×