E-Paper
Advertisement

పెట్రోల్ బైకులకు కాలం చెల్లినట్లే.. రూ. 99,999 కే 180 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

పెట్రోల్ బైకులకు కాలం చెల్లినట్లే.. రూ. 99,999 కే 180 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!
Advertisement

Oben Rorr : ఇండియన్ టూవీలర్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ బైకుల జోరు ఎలా ఉందొ చెప్పక్కర్లేదు. ఇలాంటి సమయంలో ప్రముఖ దేశీయ ఈవీ తయారీ సంస్థ ఒబెన్‌ ఎలక్ట్రిక్‌ అదిరిపోయే అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చేసింది.యస్ .. పర్యావరణానికి మేలు చేస్తూనే, జేబుకు చిల్లు పడకుండా, స్టైలిష్ లుక్‌తో దూసుకెళ్లే సరికొత్త ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ ‘రోర్‌ ఈవో’ను అఫీషియల్ గా రాష్ట్ర మార్కెట్లోకి లాంచ్ చేసింది.

కేవలం రూ.99,999 (ఎక్స్-షోరూమ్)మాత్రమే 

Advertisement

ఇక ఈ సరికొత్త బైక్ ధర వింటే ఎవరైనా సరే వెంటనే బుక్ చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటారా .. దీని ప్రారంభ ధరను కేవలం రూ.99,999 (ఎక్స్-షోరూమ్) గానే కంపెనీ నిర్ణయించింది మరి.అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉందండోయ్.ఈ బంపర్ ఆఫర్ ధర కేవలం మొదట బుక్ చేసుకునే 10 వేల మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందట. ఆ తర్వాత ఈ బైక్ అసలు ధర రూ.1,24,999 కి పెరుగుతుంది. కాబట్టి లేట్ చేయకుండా ముందే అలర్ట్ అయిపోవడం మంచిది.

also read :అఖిల్ కి ‘లెనిన్’ మరో ‘ఏజెంట్’ కాబోతుందా.. ట్రేడ్ వర్గాల్లో మొదలైన గుసగుసలు!

Advertisement

సిటీ రైడ్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్

టెక్నికల్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో అమర్చిన 3.4 కిలోవాట్ల ఎల్‌ఎఫ్‌పీ (LFP) బ్యాటరీ టెక్నాలజీ ఈ మోడల్‌కే హైలైట్‌గా నిలుస్తోంది. ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నిక రావడమే కాకుండా, మన దేశ వాతావరణ పరిస్థితులకు, ముఖ్యంగా వేసవి ఎండలకు అత్యంత సురక్షితమైనవిగా పేరు తెచ్చుకున్నాయ్. ఇక ఈ పవర్‌ఫుల్ బ్యాటరీ పుణ్యమా అని, ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే చాలు.. ఏకంగా 180 కిలోమీటర్ల మేర లాంగ్ రైడ్‌కు వెళ్ళిపోవచ్చు. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇంత మైలేజ్ అంటే రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు, సిటీ రైడ్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పక తప్పదు. ఇక చార్జింగ్ స్పీడ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం 90 నిమిషాల్లోనే (గంటన్నర) ఈ బైక్ బ్యాటరీ 80 శాతం వరకు చార్జింగ్ అయిపోతుంది. దీనివల్ల చార్జింగ్ కోసం గంటల తరబడి వెయిట్ చెయ్యాల్సిన  అవసరం అస్సలు ఉండదన్న మాట.

సున్నా నుండి 40 కిలోమీటర్ల టాప్ పికప్‌

స్పీడ్ మరియు పర్ఫార్మెన్స్ లవర్స్‌ను కూడా ఈ రోర్‌ ఈవో ఏమాత్రం నిరాశపరచదు. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే గాల్లో తేలిపోయినట్లు దూసుకెళ్లడానికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఎందుకంటే కేవలం 3 సెకండ్ల వ్యవధిలోనే సున్నా నుండి 40 కిలోమీటర్ల టాప్ పికప్‌ను అందుకుంటుంది. ఇక హైవేలపై దీని గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే అటు మైలేజ్‌లోనూ, ఇటు స్పీడ్‌లోనూ ఇది తగ్గేదేలే అంటోంది. కస్టమర్ల నమ్మకాన్ని మరింత పెంచేందుకు కంపెనీ ఏకంగా ఈ బ్యాటరీపై 8 సంవత్సరాల సుదీర్ఘమైన వారంటీని కూడా అందిస్తోంది కూడా. సాధారణంగా ఈవీ వాహనాలపై ఇంతటి భారీ వారంటీ ఇవ్వడం చాలా రేర్, కానీ ఒబెన్ ఎలక్ట్రిక్ తమ క్వాలిటీపై ఉన్న నమ్మకంతో ఈ ఆఫర్ ఇస్తోంది.

రోర్‌ ఈవో బైక్ ఒక వండర్‌ఫుల్ ఛాయిస్

ఈ లాంచింగ్ సందర్భంగా ఒబెన్ ఎలక్ట్రిక్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) హర్షవర్ధన్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, తెలంగాణ మార్కెట్‌పై తమకు భారీ అంచనాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కంపెనీకి 5 షోరూమ్‌లు అందుబాటులో ఉండగా, రాబోయే రోజుల్లో తమ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రంలో షోరూమ్‌ల సంఖ్యను ఏకంగా 25కి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. కంపెనీ దేశవ్యాప్తంగా సాధిస్తున్న మొత్తం విక్రయాలలో ఒక్క హైదరాబాద్ నగర వాటానే 10 శాతంగా ఉండటం విశేషమని, అందుకే ఇక్కడి కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా సేవలందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ ఫీచర్స్, స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ రేంజ్ ఆశించే ప్రతి ఒక్కరికీ ఈ రోర్‌ ఈవో బైక్ ఒక వండర్‌ఫుల్ ఛాయిస్ కానుంది అనడంలో సందేహమే లేదు.

also read :వివేక్ ఆత్రేయ-బాలకృష్ణ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×