E-Paper
Advertisement

AP Politics: జగన్ ‘పరకామణి’ వ్యాఖ్యలు.. మీడియాకు మసాలా, లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

AP Politics: జగన్ ‘పరకామణి’ వ్యాఖ్యలు.. మీడియాకు మసాలా, లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement

AP Politics: వైసీపీ మళ్లీ అబాసుపాలైందా? మీడియాకు జగన్ మసాలా ఇచ్చేశారా? గురువారం జగన్ మీడియా సమావేశంపై టీడీపీ నుంచి ఎదురుదాడి మొదలైందా? వైసీపీకి ఉన్న పరువుపోయినట్టేనా? ఆ పార్టీ కేడర్ అయోమయంలో పడిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది?

జగన్ ‘పరకామణి’ వ్యాఖ్యలు, వైసీపీలో కలకలం

Advertisement

పార్టీల అగ్రనేతలు.. నేతలకు కీలక సూచన చేస్తుంటారు. ఎలాంటి మసాలా ఇవ్వకుండా మీడియా ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెబుతుంటారు. అలాంటి అధినేత ఆ తరహా మసాలా ఇస్తే, ఓ రేంజ్‌లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం ఏపీలోని మాజీ సీఎం జగన్ పరిస్థితి ఆ విధంగా తయారైంది.

ఏపీలో రాజకీయాలు మారాయి. కీలక నేతలు మీడియా ముందుకొచ్చిన 24 గంటల తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఖండించేవి. ఇదంతా ఒకప్పటి మాట. సోషల్ మీడియా బలంగా ఉన్న రోజుల్లో గంటల వ్యవధిల్లో కౌంటర్ల మీద కౌంటర్లు పడిపోతున్నాయి. గురువారం మీడియా ముందుకొచ్చిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, పరకామణి చోరీ కేసులో దొంగతనం జరిగిందని నిజం ఒప్పేసుకున్నారు.

Advertisement

లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

దాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు. అది చిన్న చోరీ అని, దొంగ తన ఆస్తులను టీటీడీకి ఇచ్చారని చెప్పుకొచ్చారు.  ఇలాంటి సందర్భం ఏపీలో ఎప్పుడూ లేదని చెప్పకనే చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే చోరీ జరిగిందని నిజమేనన్నది జగన్ మాట.

ఈ వ్యవహారంపై మంత్రి లోకేష్ ఘాటు కౌంటరిచ్చారు. పార్వతీపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన , గత రాత్రి పాలకొండ నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మిస్‌ఫైర్, క్రాస్‌ఫైర్, విడాకులు వంటివి మన పార్టీలో ఉండవని వ్యాఖ్యానించారు. పరకామణిలో చోరీ జరిగితే చిన్నదంటూ జగన్‌ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఆయన్ని దేవుడే చూసుకుంటాడని అన్నారు.

ALSO READ: ఏపీలో ఇళ్ల స్థలాల దరఖాస్తు గడువు పెంపు, ఎలా అప్లై చేయాలంటే

జగన్ పరకామణి వాదనపై టీడీపీ సోషల్ మీడియా ఓ రేంజ్‌లో ఆట ఆడేసుకుంటోంది. కోట్లాది మంది భక్తులు తమ ముడుపులు, మొక్కులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పిస్తారని రాసుకొచ్చింది. అలాంటి పవిత్రమైన కానుకలను హుండీల నుంచి నేరుగా చోరీ చేస్తే.. అది చిన్న చోరీ అట, ఆ దొంగ చాలా మంచివాడని అంటున్నారని పేర్కొంది. దీనికి జగన్ మాట్లాడిన వీడియోని లింకు చేసింది.

జగన్ మాటలను చూసి వైసీపీ నేతలు షాకయ్యారు. పార్టీ నేతల కేసుల గురించి అసలు నిజాలు అధినేత స్వయంగా చెబుతున్నారని అంటున్నారు. వాటి గురించి మాట్లాడకుండా కూటమి పాలనపై ఎదురుదాడి చేస్తే బాగుండేదని అంటున్నారు.  ఈ విషయంలో పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయ్యిందనే వాదనలు ఆ పార్టీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×