E-Paper
Advertisement

CM Revanth Reddy: నర్సంపేటకు సీఎం రేవంత్.. రూ.531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy: నర్సంపేటకు సీఎం రేవంత్.. రూ.531 కోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపన
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.531 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో నర్సంపేటకు రానున్న సీఎం.. రూ.200కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవనానికి భూమి పూజ నిర్వహిస్తారు. అలాగేరూ.130 కోట్లతో నిర్మించే మెడికల్‌ కాలేజీ భవనాలకు, రూ.25కోట్లతో నిర్మించే నర్సింగ్‌ కాలేజీ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.

రూ.20 కోట్లతో నర్సంపేట మునిసిపాలిటీ పరిధిలో చేపట్టే సీసీ రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. రూ.82.56కోట్లతో వరంగల్‌-నర్సంపేట నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు నర్సంపేట శివారులోని మెడికల్‌ కాలేజీ సమీపంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.

Advertisement

ఈ పర్యటనను విజయవంతం చేయడానికి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రాకతో నర్సంపేట పట్టణం పూర్తిగా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోనూ, రహదారుల వెంబడియూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.

Advertisement

ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.

మధ్యాహ్నం ముఖ్యమంత్రి రాక అనంతరం జరిగే బహిరంగ సభపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన వివరాలు వెల్లడించనున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Also Read: నడి రోడ్డుపై గుర్రపు స్వారి.. రాజేంద్ర నగర్‌లో చప్రీగాళ్ల పిల్ల చేష్టలు, వీడియో వైరల్

ఈ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ బలం మరింత బలపడేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×