E-Paper
Advertisement

గురుకులం హాస్టల్‌లో అర్ధరాత్రి మిస్ అయిన 3వ తరగతి చిన్నారి!

గురుకులం హాస్టల్‌లో అర్ధరాత్రి మిస్ అయిన 3వ తరగతి చిన్నారి!
Advertisement

Gurukul Student: పోలవరం జిల్లా వి.ఆర్ పురం మండలంలో సోములగూడెం ఫుడ్ పాయిజన్ ఘటన మరువక ముందే మరో ఘటన కలకలం రేపుతుంది. రేఖపల్లి మినీ గురుకులంలో చదువుతున్న 3వ తరగతి విద్యార్థిని దానే నిష్విక అదృశ్యం అయిన వార్త సంచలనం రేపుతుంది. అర్ధరాత్రి సమయంలో విద్యార్థిని అదృశ్యమైంది. రాత్రి పర్యవేక్షణ లోపమే ఈ ఘటనకు కారణం అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

ఉపాద్యాయుల నిర్లక్ష్యం..

గురుకుల పాఠశాలలో టీచర్లు అందుబాటులో లేకపోవడంతో ఈ దారుణం జరిగిందని నిర్లక్ష్యంపై పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి. నాలుగు రోజుల కాల వ్యవధిలో మరో రెండో ఘటన జరగడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మిస్ అయిన విద్యార్ధికోసం ప్రత్యేక గ్రూపులుగా ఎర్పడి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Also Read: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. రూ.281 కోట్ల నిధులు విడుదల!

గాలింపు చర్యలు..

విద్యార్థిని కోసం తమ కుటుంబ సభ్యులు, అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం రేఖపల్లి ఎస్‌బీఐ బ్యాంకు పరిసర ప్రాంతంలో విద్యార్థిని నిష్విక ఆచూకీ లభ్యమైంది. విద్యార్థిని క్షేమంగా దొరకడంతో అధికారులు మరియు బాలిక తల్లితండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. హాస్టల్లో పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు విద్యార్థి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Also Read: తెలంగాణ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. టీవీ ఆర్టిస్టులకు ‘సర్కార్ బంపర్ ఆఫర్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×