E-Paper
Advertisement

శివరాజ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీపై కీలక చర్చ!

శివరాజ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీపై కీలక చర్చ!
Advertisement

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమ అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ పేదల ఇళ్ల కల నెరవేర్చడంతో పాటు రైతులకు మరింత మేలు చేకూర్చేందుకు సహాయం అందించాలని కోరారు.

పీఎంఏవై 2.0 కింద ఇళ్ల కేటాయింపు

Advertisement

గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో గ్రామీణ ఇళ్ల నిర్మాణం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లను కేటాయించాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

ఉపాధి హామీలో అదనపు పనులు

Advertisement

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పథకంలో అదనపు పనులను చేర్చాలని ముఖ్యమంత్రి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు వీలుగా 10 కొత్త పనులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్ల పెంపకం, మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని కోరారు.

భూముల అభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్ల అనుసంధానం

రైతుల భూములను మరింత సారవంతం చేయడం, నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న భూములను పునరుద్ధరించే పనులను కూడా ఈ జాబితాలో చేర్చాలని సీఎం ప్రతిపాదించారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇండ్ల’ నిర్మాణ పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పథకం కింద 90 రోజుల పని కల్పించి, వారికీ ఆర్థికంగా చేయూతనివ్వాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు.

Also Read: మెగా డీఎస్సీపై రోజా ఫైర్.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×