E-Paper
Advertisement

AP Council Session-2026: మండలిలో ఇరుకునపడ్డ వైసీపీ.. ఆ పాయింట్ పట్టుకుని ఏకేసిన మంత్రి లోకేష్

AP Council Session-2026: మండలిలో ఇరుకునపడ్డ వైసీపీ.. ఆ పాయింట్ పట్టుకుని ఏకేసిన మంత్రి లోకేష్
Advertisement

AP Council Session-2026: మండలిలో ఏదో ఒక పాయింట్ విషయంలో అధికార ప్రభుత్వానికి వైసీపీ సభ్యులు అడ్డంగా దొరికిపోతున్నారు. శుక్రవారం అంగన్‌వాడీ ఉద్యోగుల ధర్నాపై అధికార – విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో మంత్రి లోకేష్ లేవనెత్తిన పాయింట్‌తో వైసీపీ సభ్యులు ఇరుకునపడ్డారు.

మండలిలో అధికార ప్రభుత్వానికి దొరికిపోయిన వైసీపీ సభ్యులు

Advertisement

శుక్రవారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభం కాగానే అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్ అని అన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని ఆనాడు చెప్పామన్నారు. మూడు నెలలు ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా పెంచుతామని హామీ ఇచ్చామన్నారు. మిగతా విషయాలు ఆ రోజు పూర్తి చేశామన్నారు.

వేలాది మంది ఉద్యోగులు ధర్నా చేస్తున్నారని, వారిని వెళ్లి అడగాలన్నారు. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ధర్నా చేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేస్తారా? చేయరా? అంటూ ప్రశ్నించారు. ఆనాడు జరిగిన అగ్రిమెంట్‌ని కొనసాగిస్తారా? లేదా? అడిగారు. అగ్రిమెంట్ లేదని ప్రభుత్వం చెప్పడంతో తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

ఆ పాయింట్ పట్టుకుని ఏకేసిన మంత్రి లోకేష్

వెంటనే మంత్రి లోకేష్ జోక్యం చేసుకున్నారు. వైసీపీ సభ్యులు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు సదరు మంత్రి. వారు వాకౌట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ సమాధానాలు వినడానికి సభ్యులకు ఓపిక ఉండాలన్నారు. ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్ అని ప్రతిపక్ష నేత బొత్స అన్నారని వివరించారు.

అమరావతి పనులు ఎందుకు ఆపారని ప్రశ్నించారు మంత్రి లోకేష్. అన్న క్యాంటీన్లు ఎందుకు మూసి వేశారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. ఈ ప్రభుత్వం అన్నిసంఘాలతో చర్చించడానికి రెడీ ఉందన్నారు. సమస్యలను వినడానికి సిద్ధంగా ఉందన్నారు. మేము కన్వీన్స్ చేస్తామని, లేకుంటే మీరైనా మమ్మల్ని కన్వీస్ చేయాలన్నారు. ఇది మన రాష్ట్రమని, కలిసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు.

ALSO READ:  తిరుమల కొండల్లో అగ్నిప్రమాదం..  రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు

ఇది ప్రజా ప్రభుత్వమని, పరదాలు కట్టుకుని తిరగలేదన్నారు. విద్యాశాఖ, మిగతా శాఖల్లో ప్రతీ వారం ఒక పూట కచ్చితంగా అన్నిసంఘాలను కమిషనర్ కలవాలన్నారు. వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఎన్ని పరిష్కరించాము.. ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయి? అందులో పాలసీ సమస్యలు ఎన్ని ఉన్నాయి? చివరకు ఫైనాన్సియల్ సమస్యలపై రివ్యూ చేస్తున్నామని చెప్పారు మంత్రి లోకేష్.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×