E-Paper
Advertisement

జగన్ ‘మావిగన్’ డ్రామా.. కామెడీ పీస్ అంటూ కేశినేని చిన్ని ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారుగా!

జగన్ ‘మావిగన్’ డ్రామా.. కామెడీ పీస్ అంటూ కేశినేని చిన్ని ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారుగా!
Advertisement

Kesineni Chinni: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీరుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ శాంతి ప్రవచనాలు చెబుతుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆయన కుటుంబ చరిత్ర అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ మరణంపై అనుమానాలు

Advertisement

మాజీ సీఎం రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం బాధాకరమన్న చిన్ని.. ఆ మరణం వెనుక జగన్ హస్తం ఉందేమోనన్న అనుమానాన్ని అప్పట్లో సొంత పార్టీ నేతలే వ్యక్తపరిచారని గుర్తుచేశారు. ఆనాడు సంతాపం పక్కనపెట్టి, వైఎస్సార్ భౌతికకాయం రాకముందే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణకు దిగారని మండిపడ్డారు. వైఎస్సార్ మరణానికి రిలయన్స్ సంస్థే కారణమంటూ నాడు జగన్ రెచ్చగొట్టడం వల్లే కార్యకర్తలు ఆ ఆస్తులపై దాడులు చేశారని, కానీ అదే రిలయన్స్‌కు చెందిన పరిమళ్ నత్వానికి జగన్ రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

రౌడీయిజం వర్సెస్ ప్రశాంతత

Advertisement

విజయవాడ నేత వంగవీటి మోహన రంగా బడుగు బలహీన వర్గాల నాయకుడని కొనియాడిన చిన్ని.. రంగా హత్యలో ప్రధాన నిందితుడికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించారని ఆరోపించారు. ఒకే రోజు 300 కుటుంబాలను నిరాశ్రయులను చేసిన చరిత్ర వైఎస్ రాజారెడ్డిదని, ఆయనను చంపిన వాళ్లు ఇప్పుడు వైసీపీలో ఏ హోదాల్లో ఉన్నారో అందరికీ తెలుసన్నారు. వివేకానంద రెడ్డి లాంటి సౌమ్యుడిని గొడ్డలితో నరికి చంపారని, అందుకే వైసీపీ తన గుర్తును ‘గొడ్డలి’గా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈరోజు విజయవాడ ప్రశాంతంగా ఉందంటే దానికి చంద్రబాబు నాయుడే కారణమని స్పష్టం చేశారు.

లోకేష్‌ను చూసి నేర్చుకో!

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక బ్రాండ్ చంద్రబాబు మాత్రమేనని, అమరావతి రాజధానిని జగన్ విషపు కళ్లతో చూస్తున్నారని చిన్ని విమర్శించారు. జగన్ ఇప్పటికైనా నారా లోకేష్‌ను చూసి మారాలని, ఆయనను చూసి రాజకీయాలు నేర్చుకోవాలని హితవు పలికారు. తన ఇంట్లో జరిగిన మరణాలకు చంద్రబాబే కారణమంటూ జగన్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావని చిన్ని జోస్యం చెప్పారు.

Also Read: పదేళ్లు ఏం పీకారని మాట్లాడుతున్నావ్? రేవంత్ జోలికొస్తే ఊరుకోం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి మాస్ వార్నింగ్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×