E-Paper
Advertisement

పదే పదే వైఫల్యాలు ఎదురవుతున్నాయా? విజయం కోసం వాస్తులో ఉపాయాలు ఇవే

పదే పదే వైఫల్యాలు ఎదురవుతున్నాయా? విజయం కోసం వాస్తులో ఉపాయాలు ఇవే
Advertisement

ఎంత కష్టపడి పని చేసినా విజయం సాధించలేకపోతున్నామని చాలామంది బాధపడుతుంటారు. ఇలా పదే పదే వైఫల్యాలు.. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి దారి తీస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి వాతావరణంలో ప్రతికూల శక్తి ఉండటం వల్ల విజయం సాధించడంలో ఆలస్యమవుతుంది. సరైన దిక్కులు, పరిశుభ్రత, సానుకూల వాతావరణం ఉంటే ఫోకస్, ఆత్మవిశ్వాసం పెరిగి విజయం సాధించడం సులభం అవుతుంది.

ప్రధాన ఎంట్రన్స్‌ను శుభ్రంగా ఉంచండి

వాస్తు ప్రకారం.. ఇంటి ముఖ్య ద్వారం సానుకూల శక్తి ప్రవేశించే మార్గం. ఇంటి ప్రవేశంలోనే మురికి లేదా చిందరవందరగా ఉంటే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. అందుకే ప్రవేశ ద్వారం వద్ద ఎప్పుడూ శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉంచండి. పగిలిన వస్తువులు ఉంచకండి. ఆ ప్రాంతంలో మంచి మొక్కలు లేదా పాజిటివ్ ఎనర్జీ చిహ్నాలతో అలంకరించండి.

ఇంట్లో గందరగోళంగా, చిందరవందరగా ఉంచకండి

Advertisement

ఇల్లంతా వస్తువులు.. చెత్తగా, చిందరవందరగా పడి ఉంటే.. మానసికంగా ఒత్తిడి ఉంటుంది, సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. ఉపయోగం లేని వస్తువులు, పాడైన సామాన్లను ఇంట్లో నుంచి క్రమం తప్పకుండా తొలగించండి. శుభ్రమైన ఇల్లు మనసును ప్రశాంతంగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది.

పని చేసే చోటు దిక్కు సరిగ్గా ఉంచండి

పని చేసేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు దిక్కుగా ముఖం ఉంచండి. ఈ దిక్కులు.. వృద్ధి, సానుకూల శక్తినిస్తాయి. ఇంట్లో భారీ బీముల క్రింద కూర్చోవద్దు. సౌకర్యవంతమైన వర్క్ స్పేస్.. ఆత్మవిశ్వాసం, ఉత్పాదకతను పెంచుతుంది.

సహజ కాంతి, గాలి ప్రవేశించేలా చూడండి

Advertisement

చీకటి గదులు ప్రతికూల భావాలను పెంచుతాయి. కిటికీలు తెరిచి సూర్యకాంతి, తాజా గాలి రానివ్వండి. సహజ కాంతి మూడ్‌ను మెరుగుపరచి, శక్తిని ఇస్తుంది.

పాడైన గడియారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను తొలగించండి

పని చేయని గడియారాలు ఆలస్యం మరియు అడ్డంకులను సూచిస్తాయి. పని చేయని ఎలక్ట్రానిక్ వస్తువులను సరిచేయండి లేదా తొలగించండి. పని చేసే వస్తువులు ప్రగతిని సూచిస్తాయి.

మొక్కలను ఉపయోగించండి

మనీ ప్లాంట్, లక్కీ బాంబూ వంటి మొక్కలు సానుకూల శక్తిని పెంచుతాయి. పొడి బారిన మొక్కలను తొలగించండి. ఆకుపచ్చ మొక్కలు ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.

వంటింటిని శుభ్రంగా ఉంచండి

వంటింటి శుభ్రత.. కుటుంబ సామరస్యం, ఆర్థిక స్థిరత్వానికి ముఖ్యం. ఇంట్లో మురికి, లీకేజీలు లేకుండా చూడండి.

Also Read: ఇంట్లో ఒక్కసారిగా చీమలు, పురుగులు వస్తున్నాయా? జీవితంలో కష్టాలు రాబోతున్నట్లే

ప్రతికూల ఆలోచనలను వదిలేయండి

వాస్తు చిట్కాలు సానుకూల ఆలోచనలతో కలిసి పని చేస్తాయి. ధ్యానం, ప్రార్థన చేయడం మానసికంగా బలాన్నిస్తాయి.

వాస్తు శాస్త్రం.. సమతుల్యత, సానుకూలతపై ఆధారపడి ఉంటుంది. ఇంటిని శుభ్రంగా, సరైన దిక్కుల్లో ఉంచి, సానుకూల అలవాట్లు పాటిస్తే వైఫల్యాలు తగ్గి విజయం సాధించడం సులభం అవుతుంది. చిన్న మార్పులు పెద్ద విజయాలకు దారి తీస్తాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×