E-Paper
Advertisement

కొత్త ల్యాప్‌టాప్ కొన్నారా? వెంటనే ఈ 8 పనులు చేయకపోతే స్లో అయిపోతుంది!

కొత్త ల్యాప్‌టాప్ కొన్నారా? వెంటనే ఈ 8 పనులు చేయకపోతే స్లో అయిపోతుంది!
Advertisement

Improve Laptop Battery Life: కొత్త ల్యాప్‌టాప్ బాక్స్ ఓపెన్ చేసి,ఆ స్క్రీన్‌ను చూసినప్పుడు వచ్చే కిక్కే వేరు కదా! అయితే.. ల్యాప్‌టాప్ కొనగానే నేరుగా గేమ్స్ ఆడటమో, ఆఫీస్ వర్క్ లేదా సినిమాలు చూడటమో స్టార్ట్ చేస్తే పొరపాటే. ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చే ల్యాప్‌టాప్స్ బేసిక్ సెట్టింగ్స్‌తో ఉంటాయి. వాటిని అలాగే వాడితే కొద్ది రోజులకే సిస్టమ్ స్లో అవ్వడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం లాంటి తలనొప్పులు వస్తాయి. అందుకే మీ కొత్త ల్యాప్‌టాప్ రాకెట్ లాంటి వేగంతో దూసుకుపోవాలన్నా.. బ్యాటరీ లైఫ్ సూపర్ గా ఉండాలన్నా.. వెంటనే చేయాల్సిన 8 క్రేజీ పనులు ఈ ఆర్టికల్‌లో మీకోసం.

కొత్త ల్యాప్‌టాప్ కొన్నాక వెంటనే చేయాల్సిన 8 పనులు:

Advertisement

1.ఓఎస్ అప్‌డేట్ చేయడం:
ల్యాప్‌టాప్ ఆన్ చేయగానే మీరు చేయాల్సిన మొదటి పని విండోస్ లేదా మ్యాక్ ఓఎస్‌ను అప్‌డేట్ చేయడం.ల్యాప్‌టాప్ తయారైనప్పటి నుంచి మీ చేతికి వచ్చేలోపు చాలా సెక్యూరిటీ ప్యాచెస్, బగ్ ఫిక్సెస్ వచ్చి ఉంటాయి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Check for Updates’ క్లిక్ చేసి లేటెస్ట్ వర్షన్‌కి అప్‌డేట్ చేసుకోండి.

2. బ్లోట్‌వేర్ అన్‌ఇన్‌స్టాల్ చేయండి:
ల్యాప్‌టాప్ కంపెనీలు మనకు అవసరం లేని కొన్ని యాప్స్, యాంటీవైరస్ ట్రయల్ వర్షన్స్, గేమ్స్‌ను ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంచుతాయి. వీటినే బ్లోట్‌వేర్ అంటారు. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ల్యాప్‌టాప్ వేగాన్ని, బ్యాటరీని పిండేస్తాయి. కాబట్టి కంట్రోల్ ప్యానెల్‌లోకి వెళ్లి మీకు అవసరం లేని యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి.

Advertisement

3. స్టార్టప్ యాప్స్‌ను కంట్రోల్ చేయండి:
మీరు ల్యాప్‌టాప్ ఆన్ చేయగానే కొన్ని యాప్స్ (ఉదాహరణకు Spotify, OneDrive) ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతాయి. దీని వల్ల ల్యాప్‌టాప్ ఆన్ అవ్వడానికి ఎక్కువ టైమ్ పడుతుంది.టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి, ‘Startup Apps’ ట్యాబ్‌లోకి వెళ్లి అవసరం లేని యాప్స్‌ను ‘Disable’ చేయండి.

4. బ్యాటరీ పవర్ ప్లాన్ మార్చండి:
బ్యాటరీ లైఫ్ పెరగాలంటే విండోస్ లోని ‘Power & Battery’ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. అక్కడ పవర్ మోడ్‌ను ‘Balanced’ లేదా ‘Best Power Efficiency’కి మార్చండి. ఇది బ్యాటరీని ఆదా చేయడమే కాకుండా ల్యాప్‌టాప్ హీట్ అవ్వకుండా చూస్తుంది.

5.డ్రైవర్లను అప్‌డేట్ చేసుకోండి (Drivers Update):
గ్రాఫిక్స్ కార్డ్, వైఫై, బ్లూటూత్, ఆడియో వంటి హార్డ్‌వేర్ సరిగ్గా పని చేయాలంటే లేటెస్ట్ డ్రైవర్స్ ఉండాలి. Intel Driver Assistant లేదా AMD సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకుని డ్రైవర్లను అప్‌డేట్ చేయండి. దీనివల్ల డిస్‌ప్లే క్వాలిటీ,గేమ్స్ పర్ఫార్మెన్స్ పెరుగుతాయి.

6. విండోస్ డిఫెండర్ ఆన్ చేయండి:
కొత్త ల్యాప్‌టాప్స్ లో ఉండే థర్డ్ పార్టీ యాంటీవైరస్ ల వల్ల సిస్టమ్ స్లో అవుతుంది. వాటిని తీసేసి.. విండోస్ లోనే ఇన్‌బిల్ట్‌గా వచ్చే ‘Windows Defender’ ని యాక్టివేట్ చేసుకోండి. ఇది ఉచితం, ల్యాప్‌టాప్‌ను వైరస్‌ల నుంచి కాపాడటానికి వంద శాతం పవర్‌ఫుల్ గా పనిచేస్తుంది.

7. స్టోరేజ్ స్పేస్ మేనేజ్‌మెంట్:
ల్యాప్‌టాప్ లో కేవలం ఒకే డ్రైవ్ (C: Drive) ఉంటే.. దాన్ని పార్టిషన్స్ (C, D, E డ్రైవ్‌లుగా) విడగొట్టండి. కేవలం సాఫ్ట్‌వేర్లను మాత్రమే C డ్రైవ్‌లో ఉంచి, మీ పర్సనల్ ఫోటోలు, సినిమాలను మిగతా డ్రైవ్స్ లో దాచుకోండి. దీని వల్ల ల్యాప్‌టాప్ ఎప్పటికీ హ్యాంగ్ అవ్వదు.

8. రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేయండి:
భవిష్యత్తులో మీ ల్యాప్‌టాప్ లో ఏదైనా సాఫ్ట్‌వేర్ ప్రాబ్లం వస్తే.. సిస్టమ్ ని మళ్లీ మొదటికి తీసుకురావడానికి ‘Create a Restore Point’ ఆప్షన్ ఉపయోగ పడుతుంది. ల్యాప్‌టాప్ పక్కాగా ఉన్నప్పుడే ఈ రీస్టోర్ పాయింట్‌ను సెట్ చేసి పెట్టుకోవడం చాలా స్మార్ట్ ఐడియా.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×