E-Paper
Advertisement

Narayana : నారాయణకు హైకోర్టులో ఊరట..ఇంట్లోనే విచారణకు అనుమతి

Narayana : నారాయణకు హైకోర్టులో ఊరట..ఇంట్లోనే విచారణకు అనుమతి
Advertisement

Narayana : మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడీ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని నారాయణకు సీఐడీ అధికారులు 160 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారు.

సీఐడీ నోటీసుపై మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నానని విచారణకు హాజరుకాలేనని కోర్టుకు తెలిపారు. నారాయణ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నారాయణ వయస్సు 65 ఏళ్లు దాటిందని హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. నారాయణను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో సీఐడీ అధికారులు ప్రశ్నించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×