E-Paper
Advertisement

ED Raids : క్యాసినో కేసులో తలసాని సోదరులపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఎల్ . రమణకు నోటీసులు

ED Raids : క్యాసినో కేసులో తలసాని సోదరులపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఎల్ . రమణకు నోటీసులు
Advertisement

ED Raids : 3 నెలల క్రితం చీకోటి ప్రమీణ్ క్యాసినో వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు ఈడీ అధికారులు ఈ కేసుపై మళ్లీ ఫోకస్ పెట్టారు. తలసాని సోదరులు ధర్మేంద్ర యాదవ్‌, మహేశ్‌ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. క్యాసినో నిర్వహించిన చీకోటి ప్రవీణ్‌, ఆయన అనుచరుడు శ్రీనివాస్‌రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు 3 నెలల క్రితం సోదాలు చేశారు. 8 బృందాలతో సోదాలు జరిపారు. అప్పుడు కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించిన తర్వాత మరోసారి దర్యాప్తును ప్రారంభించారు.

తలసాని మహేశ్‌, తలసాని ధర్మేంద్రయాదవ్‌ చీకోటి ప్రవీణ్‌తోపాటు క్యాసినో కోసం విదేశాలకు వెళ్లారని ఈడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో నిందితులు హవాలాకు పాల్పడ్డారని ప్రాథమికంగా తేల్చారు. విదేశాలకు నగదు తీసుకెళ్లే క్రమంలో ఆర్‌బీఐ నిబంధనలు పాటించారా? లేదా? అనే దానిపై వారిని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. వారి నుంచి మనీ లాండరింగ్, క్యాసినో కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

Advertisement

క్యాసినో వ్యవహారంలో మరో రెండ్రోజుల్లో రాయలసీమకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తారని సమాచారం. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు త్వరలో వారిని విచారించే అవకాశముందని సమాచారం.

చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. గురువారం విచారణకు రావాలని కోరింది. తెలంగాణకు చెందిన ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలతో చీకోటి ప్రవీణ్‌ వాట్సాప్‌ లో చాటింగ్‌ చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ చాట్‌ ఆధారంగా ఆ నాయకులతో ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అవసరమైతే ఆ ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×