E-Paper
Advertisement

CM Vijay In Kakinada: సీఎం విజయ్ కాకినాడ టూర్.. తెర వెనుక వైసీపీ, అసలు కారణం అదేనా?

CM Vijay In Kakinada: సీఎం విజయ్ కాకినాడ టూర్.. తెర వెనుక వైసీపీ, అసలు కారణం అదేనా?
Advertisement

CM Vijay In Kakinada: అదిగో పులి.. ఇదిగో మేక అన్న చందంగా మారింది ఏపీ రాజకీయాల పరిస్థితి. రెండు రోజులుగా తమిళనాడు సీఎం విజయ్ ఏపీకి రాబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పూర్తిగా తమిళనాడులో తిరిగిన సందర్భం లేదు. అలాంటిది ఏపీకి వస్తున్నాడన్న ప్రచారం వెనుక అసలు కథేంటి? తెర వెనుక వైసీపీ ఉందా? ఇవే ప్రశ్నలు చాలామంది వెంటాడుతున్నాయి.

సీఎం విజయ్ కాకినాడ టూర్.. తెర వెనుక వైసీపీ

Advertisement

తమిళనాడు సీఎం విజయ్ ఏపీ పర్యటనకు వస్తున్నట్లు ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కాకినాడలోని కైట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు‌ రోజులుగా ఓ వీడియో సోషల్‌మీడియా హంగామా చేస్తోంది. విజయ్‌కు స్వాగతం పలుకుతూ ఓ హోర్డింగ్ ఏర్పాటు చేశారు.

సీఎం విజయ్.. ఏపీ టూర్‌పై ఆయన పార్టీకి సంబంధించి కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. దీనిపై ఆ పార్టీ శ్రేణులు పెద్దగా స్పందించలేదు. కాకపోతే ఏపీకి సీఎం విజయ్ వస్తున్నాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం విజయ్‌ను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ వీడియోలో నిజమెంత? కేవలం 12 సెకన్ల నిడివి గల వీడియో అది.

Advertisement

మార్కెట్ చేసుకునే ప్రయత్నంలో ఆ కాలేజీ

హోర్డింగ్ వీడియోలో అక్కడక్కడ తెలుగులో పేర్లు రాసి ఉన్న షాపులు కనిపిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీకి వస్తున్నారంటూ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. అటు కాలేజీ యాజమాన్యం దీని గురించి ఏ మాత్రం స్పందించలేదు. ఈ హోర్డింగ్ వల్ల ఆ కాలేజీకి బోలెడంత ప్రచారం వచ్చింది. కేవలం మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా ఆ విధంగా ఏర్పాటు చేశారన్నది కొందరి వాదన.

దీని వెనుక మరో వాదన కూడా మొదలైంది. ఈ హోర్డింగ్స్ వెనుక వైసీపీకి చెందిన కొందరు నేతలు ఉన్నారనే ప్రచారం లేకపోలేదు. ఎందుకంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే విజయ్ మావాడేనంటూ వైసీపీ నేతలు మీడియా ముందు ఒకటే రీసౌండ్.

ALSO READ: తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలర్ట్.. రెండు రోజులు పాటు వీఐపీ దర్శనాలు రద్దు!

ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైసీపీ నేతలు నేరుగా సీఎంగా విజయ్‌తో సమావేశమైన సందర్భం లేదు. ఏదో కావాలని వైసీపీకి హౌప్ తెచ్చుకునేందుకు ఈ స్కెచ్  వేసినట్టు చర్చించుకుంటున్నారు. మొత్తానికి విజయ్‌ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోందని అంటున్నవాళ్లూ లేకపోలేదు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అది పెద్ద పార్టీగా అవతరించింది. కావాల్సినంత మెజార్టీ లేకపోవడంతో కాంగ్రెస్-వామపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటైంది. పాలనాపరమైన అంశాలతో ప్రస్తుతం సీఎం విజయ్ బిజీగా ఉన్నారు. ఉంటే తమిళనాడు, ఏదైనా పని ఉంటే ఢిల్లీ తప్పితే ఇప్పటివరకు బయటకు వెళ్లిన సందర్భం లేదని అంటున్నారు.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×