E-Paper
Advertisement

CM Jagan: విద్యారంగంలో AI.. టెక్నాలజీ వాడకంపై సీఎం జగన్ కీలక సూచన..

CM Jagan: విద్యారంగంలో AI.. టెక్నాలజీ వాడకంపై సీఎం జగన్ కీలక సూచన..
Advertisement
cm jagan

CM Jagan News today(AP latest news): పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి. విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం కీలక సమావేశం నిర్వహించారు. బోధనలో, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ అనుసంధానంపై దృష్టి సారించాలని సూచించారు సీఎం జగన్‌. ఏఐ, వర్చువల్‌ రియాల్టీ, అగ్‌మెంటేషన్‌ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై చర్చించారు. ఈ రంగాల్లో క్రియేటర్లుగా విద్యార్థులను తయారు చేయడంపై దృష్టి సారించాలన్నారు జగన్.

విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టామని.. విద్యారంగంలోటెక్నాలజీని విరివిగా వాడాలన్నారు సీఎం జగన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ చాలా అవసరమని.. మన విద్యార్థులు క్రియేటర్లు ఉండాలి కానీ.. ఫాలోవర్లుగా కాదన్నారు ఆయన. మన విద్యావిధానం విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు కల్పించేలా చూడాలన్నారు. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు పెంచాలన్నారు. మన విద్యా విధానం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్నారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచాలని.. ప్రాథమిక విద్య నుంచే మార్పు రావాలన్నారు సీఎం జగన్.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×