E-Paper
Advertisement

Chandrababu : టీడీపీకి మళ్లీ అధికారమిస్తేనే ఏపీ అభివృద్ధి…వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

Chandrababu : టీడీపీకి మళ్లీ అధికారమిస్తేనే ఏపీ అభివృద్ధి…వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
Advertisement

Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పెరిగిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి విమర్శించారు. కర్నూలు జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న టీడీపీ అధినేత రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు. ఆదోనిలో నిర్వహించిన రోడ్‌షోలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ బాగుపడాలంటే టీడీపీకి మళ్లీ అధికారం రావాలని స్పష్టం చేశారు.

ఇదేం ప్రభుత్వం
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. చెత్త పైనా పన్ను వేసిందని మండిపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దొరకడంలేదన్నారు. ప్రభుత్వం నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు భూములను కబ్జాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Advertisement

ఎవరికీ భయపడను
ఏపీని నేర రాష్ట్రంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తనను భయపెట్టాలని చూస్తున్నారని కానీ ప్రజలకు తప్ప ఎవరకీ భయపడనని స్పష్టం చేశారు.

టీడీపీతోనే అభివృద్ధి
వైఎస్ఆర్ సీపీ పాలనలో నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. నిరుద్యోగులకు తాను ఐటీ ఆయుధాన్ని ఇచ్చానని తెలిపారు. సంపద సృష్టించానని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ పాలనలో పెట్టుబడిదారులు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×