E-Paper
Advertisement

Zelenskyy : పోలండ్‌ లో పడిన క్షిపణి ఉక్రెయిన్‌ది కాదు..దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలి: జెలెన్‌స్కీ

Zelenskyy : పోలండ్‌ లో పడిన క్షిపణి ఉక్రెయిన్‌ది కాదు..దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలి: జెలెన్‌స్కీ
Advertisement

Zelenskyy: నాటో సభ్యదేశం పోలండ్ లో పడిన క్షిపణి ఎక్కడ నుంచి ప్రయోగించారో ఇంకా తేలలేదు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని షెవాడో గ్రామంలో జరిగిన క్షిపణి దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. ఆ క్షిపణిని ఉక్రెయిన్ ప్రయోగించలేదని స్పష్టం చేశారు.

ఇండోనేషియాలోని బాలి వేదికగా జి-20 దేశాల సదస్సు జరుగుతున్నసమయంలో ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు చేస్తోంది. అదే సమయంలోనే ఉక్రెయిన్‌ సరిహద్దు దేశం పోలండ్‌ శివారులోని షెవాడో గ్రామంపై ఓ క్షిపణి పడింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇది రష్యా ప్రయోగించిన క్షిపణే అని తొలుత ప్రచారం జరిగింది. ఆ క్షిపణి రష్యా నుంచి ప్రయోగించలేదని తర్వాత నిర్ధారణ అయ్యింది. దీనిపై రష్యా దాడులకు ప్రతిగా ఉక్రెయిన్‌ ప్రయోగించిన క్షిపణి తమ భూభాగంలో పడిందని పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ ప్రకటించారు.

Advertisement

పోలండ్ అధ్యక్షుడి ప్రకటన తర్వాత నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ ఉక్రెయిన్‌పై విమర్శలు చేశారు. కీవ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ క్షిపణుల వల్లే పోలండ్‌ ఘటన జరిగిందని తెలిపారు. నాటో చీఫ్ ప్రకటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. అది తమ దేశం ప్రయోగించిన క్షిపణి కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని టాప్‌ కమాండర్లు స్పష్టంగా చెప్పారని ప్రకటించారు. ఉక్రెయిన్‌ను నిందించడం సరికాదన్నారు. నిజానిజాలను తెలుసుకునేందుకు క్షిపణి పేలిన ప్రాంతంలో దర్యాప్తు జరిపేందుకు ఉక్రెయిన్‌ అధికారులకు అనుమతినివ్వాలని జెలెన్‌స్కీ కోరారు. అయితే పోలండ్‌లో పడిన క్షిపణి సోవియట్‌ కాలం నాటిదని తేలింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×