E-Paper
Advertisement

Vande Bharat Express From Visakha : విశాఖ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎప్పటినుండంటే..?

Vande Bharat Express From Visakha : విశాఖ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎప్పటినుండంటే..?
Advertisement

Vande Bharat Express From Visakha : వందే భారత్ బులెట్ ట్రైన్ ఇక తెలుగు రాష్ట్రల్లో కూడా స్టార్ట్ కానుంది. ఇటీవల విశాఖ వచ్చిన ప్రధాని విశాఖలో బులెట్ ట్రైన్ సేవల గురించి ప్రస్థావించారు. గుజరాత్‌లో మొదలైన వందే భారత్ హైస్పీడ్ ట్రైన్ సేవలు క్రమక్రమంగా భారత్ మొత్తం విస్తరించనుంది. కొన్ని రోజుల ముందే దక్షిణ భారత్‌లో స్టార్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ నుంచి విజయవాడ మీదుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సేవలు ప్రారంభించే యోచనలో ఉంది రైల్వే శాఖ. అయితే విశాఖ నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వరకు నడపాలనే ప్రతిపాదన కూడా ఉంది. విశాఖ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి వరకు వందే భారత్ సేవలు అందించాలనే ప్రతిపాదన కూడా చేస్తున్నారు.

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 130 కిమీల వేగంతో వెళ్తుంది. విశాఖ నుంచి విజయవాడకు కేవలం 4 గంటల్లో చేరుకోవచ్చు. విశాఖ నుంచి సికింద్రబాద్‌కు కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది. విశాఖ నుంచి వందే భారత్ ఎప్పటి నుంచి నడపాలనే దానిపైన ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఒక వందే భారత్ ట్రైన్‌లో 1300ల మందికి పైగా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే.. చైర్ కార్‌కు రూ.1200, ఎక్జిక్యుటివ్ క్లాస్‌కు రూ.2295గా చార్జీలు ఉంటాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×