E-Paper
Advertisement

చంద్రబాబు ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన అంబటి.. ఆ ఆస్తి లోకేష్ పేరిట ఎలా రాశారు?

చంద్రబాబు ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన అంబటి.. ఆ ఆస్తి లోకేష్ పేరిట ఎలా రాశారు?
Advertisement

Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలనను గాలికొట్టేసి, కేవలం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన కుటుంబమే లక్ష్యంగా చౌకబారు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని, ఆయన జీవితమంతా నీచ రాజకీయాలేనని ధ్వజమెత్తారు.

జగన్ పేరు చెప్తేనే ప్రస్టేషన్

Advertisement

చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని అంబటి విమర్శించారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనులను, ‘మావిగన్’ అనే పేరును తలుచుకుంటేనే చంద్రబాబుకు తీవ్రమైన ప్రస్టేషన్ వచ్చేస్తోందని అన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా చంద్రబాబు ఏమీ చేయలేకపోయారని, అదే పులివెందుల వెళ్తే వైఎస్సార్, జగన్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో కళ్లారా చూడవచ్చని సవాల్ విరాశారు. ఎన్నికలకు వెళ్లేటప్పుడు కూడా తాము చేసిన అభివృద్ధిని చూపే వెళ్తామని చెప్పడంతో చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.

కుటుంబ విలువలు లేని వ్యక్తి

Advertisement

చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ.. తడి గుడ్డలతో గొంతులు కోసే రకం చంద్రబాబు అని అంబటి వ్యాఖ్యానించారు. సొంత తల్లిదండ్రులు చనిపోతే కర్మకాండలు కూడా సరిగ్గా చేయని వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలకు సూక్తులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని లోకేష్ పేరు మీద రాయించుకున్నారని, కన్న చెల్లెళ్లను కనీసం ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టని చరిత్ర ఆయనదని ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబంలోని వారందరినీ బయటకు నెట్టేసిన వ్యక్తి చంద్రబాబని, ఆయన రాజకీయ ప్రస్థానంపై తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావే స్వయంగా పుస్తకం రాశారని గుర్తుచేశారు. ఆఖరికి సొంత తమ్ముడికి సంకెళ్లు వేసి ఇంట్లో దాచిపెట్టిన చంద్రబాబుకు, తమ పార్టీని ‘గొడ్డలి పార్టీ’ అని విమర్శించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.

Also Read:  ఉప్పల్‌లో దారుణం.. భార్యను చంపి.. బావమరదలికి ఫోన్ చేసిన భర్త!

రాష్ట్రంలో అరాచక పాలన, సాయికృష్ణ కేసు

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసులపై దాడులు చేస్తున్నది కూటమి వారేనని అంబటి ఆరోపించారు. సాయికృష్ణ అనే యువకుడిని చంపేసి, కనీసం బూడిద కూడా ఇవ్వలేదని ఆ తల్లి రోదిస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడం లేదన్నారు. పైగా పవన్ కళ్యాణ్ ఆ యువకుడిని క్రిమినల్ అనడం దుర్మార్గమన్నారు. ఇన్నాళ్లూ దొరకని బూడిద, ఎముకలు అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్‌కు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ, ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఐ నాగరాజు లాంటి అధికారులే తమ ప్రాణాలకు రక్షణ లేదని భయపడుతున్నారంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని అంబటి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సొల్లు కబుర్లు ఆపి, ఇచ్చిన హామీల అమలుపై, పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×