E-Paper
Advertisement

దొంగలను ఏంటి భయ్యా.. ఇలా టేపులతో చుట్టేశారు, క్రేజీ ప్లాన్!

దొంగలను ఏంటి భయ్యా.. ఇలా టేపులతో చుట్టేశారు, క్రేజీ ప్లాన్!
Advertisement

మీ చేతికి దొంగలు చిక్కితే ఏం చేస్తారు? చెట్టుకు కట్టేసి తాట తీస్తారు లేదా పోలీసులకు ఫోన్ చేసి అప్పగిస్తారు. కానీ, ఇలా టేపులతో చుట్టేసి మరీ రివేంజ్ తీర్చుకుంటారా? అది కూడా తల నుంచి కాళ్ల వరకు…

అలాంటి ఆలోచన మీకు ఇప్పటివరకు వచ్చి ఉండదు. కానీ, ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తికి వచ్చింది. దొంగలతో విసుగుపోయిన ఆయన.. ఆ నలుగురు దొంగలను ఇలా ‘చుట్టి’ పడేశాడు. ఏంటీ ఒక్కడే.. ఆ నలుగురిని పట్టేసుకుని చుట్టేశాడా? అనేగా మీ సందేహం. అయితే, అసలు విషయంలోకి వెళ్లిపోదాం.

ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా?

Advertisement

ఈ ఘటన ఇండోనేషియాలోని పెంబాంగ్‌లో.. 2025లో చోటుచేసుకుంది. పెంబాంగ్‌లో వరుస దొంగతనాలు స్థానికుల సహనానికి పరీక్ష పెట్టాయి. పోలీసులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా లాభం లేకపోయింది. దొంగతనం జరిగిన కొన్ని రోజులు గస్తీ కాస్తూ పోలీసులు హడావిడి చేసేవారు. ఆ తర్వాత ఆ విషయమే మరిచిపోయేవారు. దీన్ని అవకాశంగా చూసుకుని దొంగలు రెచ్చిపోయారు. ఇల్లు ఖాళీగా ఉందని తెలిస్తే చాలు.. చొరబడిపోయేవారు. చివరికి వారి ఆగడాలు ఎంతగా పెరిగాయంటే.. మనుషులన్న ఇళ్లలోకి కూడా దూరిపోయి దోపిడీలు చేయడం మొదలుపెట్టారు.

విసుగుపోయి.. వలవేసి..

ఈ దొంగతనాలు అక్కడ ఓ వ్యక్తిని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. పోలీసులకు చెప్పినా ఫలితం ఉండటంలేదని భావించి.. స్థానికులతో కలిసి ఒక ప్లాన్ వేశాడు. వాళ్లను ట్రాప్ చేసి పట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఓ రోజు రాత్రి.. ఊహించినట్లే దొంగలు అతడి ఇంట్లోకి చొరబడ్డారు. ఎవరూ లేరనుకుని.. చేతికి దొరికిన వస్తువును సంచుల్లో వేసుకోవడం మొదలుపెట్టారు. వారి కోసమే ఎదురుచూస్తున్న ఆ ఇంటి యజమాని, స్థానికులు ఇంటిని చుట్టుముట్టారు. ముందు వెనుక డోర్లను తెరుచుకుని దొంగలను పట్టేసుకున్నారు.

వింత ఆలోచన.. టేపులతో చుట్టేసి..

Advertisement

సాధారణంగా దొంగలు దొరికితే.. తాళ్ల కట్టేస్తారు. కానీ, అది చాలా రొటీన్ అని భావించారో ఏమిటో.. ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు డక్ట్ టేపులను సిద్ధం చేసుకుని.. ఆ నలుగురు దొంగలను తల నుంచి కాళ్ల వరకు చుట్టిపడేశారు. శ్వాస పీల్చుకోడానికి, తినడానికి, తాగడానికి వీలుగా ముక్కు, నోటి దగ్గర మాత్రం ఖాళీ వదిలారు. అంతటితో ఆగలేదు.. ఆ టేపులతోనే వారిని బొమ్మల్లా ముస్తాబు చేశారు. ఆ తర్వాత ఫొటోలు తీసుకుని.. పోలీసులకు ఫోన్ చేశారు.

సోషల్ మీడియాలో తెగ వైరల్..

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బొమ్మల్లా భలే ఉన్నారే అనుకుంటూ జనాలు ఆ ఫొటోలను తెగ షేర్ చేసుకున్నారు. ఆ నలుగురు దొంగలకు ‘టెలీటబ్బీస్’ అనే పేరుతో మీమ్స్ క్రియేట్ చేశారు. అయితే.. చాలామంది దీన్ని ఫన్నీగా తీసుకున్నా.. కొందరు మాత్రం వ్యతిరేకించారు. నడవడానికి, కదలడానికి వీలు లేకుండా వాళ్లను అలా టేపులతో చుట్టేయడం చాలా దారుణం అని, మానవ హక్కుల ఉల్లంఘన అంటూ మండిపడ్డారు. మరి మీరు ఏం అంటారు? దొంగలు మీ ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తారు?

Also Read: ఈ-సిమ్‌తో ఇంటర్నెట్ స్పీడు పెరుగుతుందా? బెస్ట్ నెట్ వర్క్‌కు ఏ సిమ్ బెస్ట్?

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×