E-Paper
Advertisement

13 దేశాలు చుట్టేసే ఏకైక రైలు.. దీని టికెట్ ధర ఎంతో తెలుసా?

13 దేశాలు చుట్టేసే ఏకైక రైలు.. దీని టికెట్ ధర ఎంతో తెలుసా?
Advertisement

Ultimate Train Travel Experience: ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన రైలు ప్రయాణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జీవితాంతం మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. వాటిలో ఒకటి  పోర్చుగల్- సింగపూర్ ట్రైన్ జర్నీ. ఈ ప్రయాణం మొత్తం 13 దేశాల మీదుగా సాగుతుంది. కేవలం గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రమే కాదు.. ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, ప్రకృతి అందాలు, లైఫ్ స్టైల్ ను దగ్గరగా చూసే అరుదైన అవకాశం కల్పిస్తుంది కూడా.

పోర్చుగల్ To సింగపూర్

ఈ రూట్ పోర్చుగల్‌ లో ప్రారంభమై స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, మంగోలియా, చైనా, లావోస్, థాయిలాండ్, మలేషియా మీదుగా చివరకు సింగపూర్‌ కు చేరుకుంటుంది. మొత్తం 18,755 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.  ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 21 రోజుల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో పలు రైల్వే నెట్‌ వర్క్‌ లను ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే, దీనిని సాధారణ రైలు ప్రయాణం కంటే అతిపెద్ద ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ గా చెప్పుకోవచ్చు.

ఒక్కో టికెట్ ధర సుమారు రూ. 1.02 లక్షలు

Advertisement

టికెట్ ఖర్చు క్లాస్, సీజన్, బుకింగ్ సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా ఈ మొత్తం ప్రయాణానికి సుమారు రూ.1.02 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే, ప్రయాణంలో వసతి, ఆహారం, ఇతర ఖర్చులు అదనంగా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రతి దేశం తన ప్రత్యేకతతో ఆకట్టుకుంటుంది. యూరప్‌ లోని ఆధునిక నగరాలు, రష్యాలోని విస్తారమైన మైదానాలు, మంగోలియాలోని ప్రకృతి అందాలు, చైనాలోని ఆధునిక రైల్వే వ్యవస్థ, ఆగ్నేయాసియా దేశాల సంస్కృతి ప్రతి ప్రాంతం కొత్త అనుభూతిని ఇస్తుంది.

అంతేకాదు, ఒకే ప్రయాణంలో అనేక భాషలు, వంటకాలు, సంప్రదాయాలు, వాతావరణ మార్పులు, టైమ్ జోన్లను ఎక్స్ పీరియెన్స్ చేసే అవకాశం లభిస్తుంది. అందుకే ప్రపం చవ్యాప్తంగా ట్రావెల్ ప్రేమికులు ఈ రూట్‌ ను తమ డ్రీమ్ జర్నీగా భావిస్తుంటారు.

టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే?

Advertisement

ఈ మార్గంలో ప్రయాణించాలనుకునేవారు ముందుగానే రైలు టికెట్లు, వీసాలు, ప్రయాణ అనుమతులు కావాల్సి ఉంటుంది. అందుకే, ఈ ప్రయాణాన్ని కొద్ది నెలల ముందే చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రతి దేశానికి వేర్వేరు ఎంట్రీ నిబంధనలు ఉంటాయి. పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు సాగే ఈ 13 దేశాల రైలు ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రయాణాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కొత్త దేశాలు చూడాలనుకునే వారికి, విభిన్న సంస్కృతులను అనుభవించాలనుకునే వారికి ఇదో అద్భుతమైన రైలు ప్రయాణంగా చెప్పుకోవచ్చు.

Read Also: వందేభారత్‌ రైల్లో స్పెషల్ కమాండోలు.. కారణం ఏంటంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×