E-Paper
Advertisement

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!
Advertisement

Ambati Rambabu: గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హోం మంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యల దుమారంపై ఆయన స్పందిస్తూ.. తన అభిప్రాయాలను స్పష్టంగా వివరించారు. ఈ వ్యవహారంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

MRPS నిరసనలపై అంబటి స్పందన

Advertisement

తన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళనలు చేయడం ధర్మం కాదని అంబటి రాంబాబు అన్నారు. హోం మంత్రిగా అనిత పదవిని స్వీకరించినప్పటి నుంచి ఆమె శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమవుతూనే ఉన్నారని, అందుకే తాను రాజకీయంగా విమర్శలు చేశానని చెప్పారు. తాను ఎప్పుడూ ఆమెను కులం పేరుతో దూషించలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నడిరోడ్డుపై మహిళలను వివస్త్రలను చేస్తున్నారని, పోలీసుల వేధింపులు తాళలేక సామాన్య ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే నిలదీశానన్నారు.

ఎమ్మార్పీఎస్ ప్రచారంపై ఆగ్రహం

Advertisement

తాను మాదిగ సామాజిక వర్గాన్ని దూషించినట్లు ఎమ్మార్పీఎస్ నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, దాన్ని వారు నిరూపించాలని అంబటి సవాలు విసిరారు. హోం మంత్రి అనిత ఏ సామాజిక వర్గానికి చెందిందో కూడా తనకు తెలియదని, ఆమెతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప, ఇలా కులాలను ఆపాదించడం సరికాదని హితవు పలికారు.

మందకృష్ణ మాదిగపై గౌరవం.. అనితకు సారీ లేదు!

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన ఒక పోరాట యోధుడని అంబటి కొనియాడారు. ‘నేనన్న మాటల్లో తప్పు ఉందని మందకృష్ణ గారు చెప్తే, ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని అనిపిస్తే ఆయనకు క్షమాపణ చెబుతాను. కానీ హోం మంత్రి అనితకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పేది లేదు’ అని తేల్చిచెప్పారు. ఎమ్మార్పీఎస్ నాయకులు నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదని ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read: రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×