// //
Hyderabad: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనగా.. సాయంత్రం 5 గంటల సమయంలో వర్షం తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. నగరం నడిబొడ్డుతో పాటు పశ్చిమ భాగంలోని జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గం, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షం కురుస్తోంది. కాగా, నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చినుకులు పడుతుండటంతో వర్షం విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ, సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు, ఐటీ ఉద్యోగులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో పలు చోట్ల ట్రాఫిక్ నెమ్మదించింది.
Also Read: అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!