E-Paper
Advertisement

నలుగురు పిల్లల తల్లి కోసం టవరెక్కిన ప్రేమికుడు.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా!

నలుగురు పిల్లల తల్లి కోసం టవరెక్కిన ప్రేమికుడు.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా!
Advertisement

UP Man: ప్రేమ గుడ్డిదంటారు పెద్దలు.. అది వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే ఒక చక్కని ఉదాహరణ. తనకంటే 20 ఏళ్లు పెద్దదైన, నలుగురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ ప్రేమ కోసం ఓ యువకుడు ఏకంగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవరెక్కి నానా హంగామా చేశాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.

ఫోన్ ఎత్తలేదని ముంబై నుండి యూపీకి..

Advertisement

పోలీసుల వివరాల ప్రకారం.. యూపీకి చెందిన చందన్ అనే యువకుడు ముంబైలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి 50 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. సదరు మహిళకు అప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొద్దిరోజులుగా ఆమె చందన్ ఫోన్ కాల్స్ ఎత్తడం మానేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చందన్.. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలనే ఆరాటంతో ముంబై నుండి నేరుగా ఉత్తరప్రదేశ్ చేరుకున్నాడు.

112 కి ఫోన్ చేసి మరీ టవరెక్కిన ప్రియుడు

Advertisement

అక్కడికి వచ్చినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, చందన్ ఒక ఊహాత్మక నిర్ణయం తీసుకున్నాడు. ఊరి చివర ఉన్న 200 అడుగుల మొబైల్ టవర్ పైకి సరసరకెక్కి కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా, తనే స్వయంగా పోలీసుల అత్యవసర నంబర్ ‘112’ కి డయల్ చేసి.. ‘నేను టవరెక్కాను, నా ప్రియురాలిని ఇక్కడికి పిలవండి’ అంటూ సమాచారం ఇచ్చాడు.

Also Read: ఏపీ సంజీవిని ప్రాజెక్ట్.. ఫ్రీ మెడికల్ టెస్ట్‌లు, మందులు ఎలా పొందాలో తెలుసా?

ఊపిరి పీల్చుకున్న పోలీసులు

విషయం తెలిసిన వెంటనే పోలీసులు, స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. కిందకు దిగాలంటూ పోలీసులు ఎంత నచ్చజెప్పినా చందన్ వినలేదు. చివరకు ‘నీ ప్రియురాలిని ఇక్కడికి పిలిపించి మాట్లాడిస్తాం, ముందు కిందకు దిగు’ అంటూ పోలీసులు హామీ ఇవ్వడంతో గంటల హైడ్రామా తర్వాత చందన్ కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ‘ముదురు’ ప్రేమకథ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Also Read: అల్లుడితో అక్రమ సంబంధం.. అడ్డువచ్చాడని భర్తను కిరాతకంగా చంపిన భార్య!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×