E-Paper
Advertisement

‘గే’ డేటింగ్ యాప్‌లో పరిచయం.. నమ్మి వెళ్లితే నిలువ దోపిడీ, కిరాతకులు ఏం చేశారంటే?

‘గే’ డేటింగ్ యాప్‌లో పరిచయం.. నమ్మి వెళ్లితే నిలువ దోపిడీ, కిరాతకులు ఏం చేశారంటే?
Advertisement

Nagpur: ప్రపంచవ్యాప్తంగా డేటింగ్ యాప్‌ ట్రెండ్ మొదలైంది. ఆ తరహా యాప్‌లు యువతకు కొత్త స్నేహాలను పరిచయం చేస్తోంది. ఒక్కోసారి ఊహించని ప్రమాదాల్లోకి నెడుతున్నాయి. తాజాగా నాగ్‌పూర్‌లో గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి షాకింగ్ అనుభవాన్ని ఎదుర్కొన్నాడు డెలివరీ బాయ్.  దీంతో పోలీసులు రంగంలోకి దిగేశారు.

నాగపూర్‌లో దారుణమైన ఘటన.. ‘గే’ డేటింగ్ యాప్‌లో పరిచయం

Advertisement

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు‌ చెందిన ఓ యువకుడు ఓ సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఖాళీగా ఉండే సమయంలో గే డేటింగ్ యాప్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. ఈ నేపథ్యంలో నేరగాళ్ల ముఠాలోని ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇ ద్దరు యాప్‌లో తరచూ చాటింగ్ చేసుకోవడం, వివరాలు పంచుకున్నారు. నమ్మకం కుదిరిన తర్వాత నేరుగా కలుసుకోవాలని డిసైడ్ అయ్యారు.

దీనివెనుక ఓ ముఠా ఉందని గుర్తించలేకపోయాడు డెలివరీ బాయ్. జూన్ 22న అర్ధరాత్రి డెలివరీ బాయ్ తన డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. నాగ్‌పూర్‌లోని మాంకాపూర్ ప్రాంతానికి రాగానే ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. ఆ యువకుడ్ని స్కూటీపై ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లాక నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా డెలివరీ బాయ్ స్కూటీని అడ్డగించారు. ఐదుగురు వ్యక్తులు కలిసి డెలివరీ బాయ్‌పై దాడి చేశారు.

Advertisement

నమ్మిన యువకుడి నిలువ దోపిడీ, రంగంలోకి పోలీసులు

ఆ యువకుడ్ని కిడ్నాప్ చేసి ఓ కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. డెలివరీ బాయ్‌ని తీవ్రంగా బెదిరించి, స్కూటీ తాళాలు, మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డును లాక్కున్నారు. డబ్బులు ఇవ్వకంటే ప్రాణాలు తీస్తామని బెదిరించాడు. దీంతో భయపడిన బాయ్, తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి తన అకౌంట్‌కు డబ్బులు పంపాలని వేడుకున్నాడు.

అలా బాయ్ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 90 వేలు వచ్చాయి. ఆ తర్వాత నిందితులు ఏటీఎం కార్డును ఉపయోగించి వివిధ ప్రాంతాల్లో ఆ డబ్బుని విత్‌డ్రా చేశారు. చివరకు డెలివరీ బాయ్‌ని వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన గురించి తేరుకున్న ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు.

ALSO READ: అల్లుడితో అక్రమ సంబంధం.. అడ్డువచ్చాడని భర్తను కిరాతకంగా చంపిన భార్య!

కేసును పరిగణించిన పోలీసులు అధికారులు, మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మాంకాపూర్ చౌక్ నుంచి నిందితులు ప్రయాణించిన మార్గంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దాని ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించారు. చివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుని నేరాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. డేటింగ్ యాప్‌లు ఉపయోగించేటప్పుడు వాటి ప్రాముఖ్యతను ఈ కేసు నొక్కి చెబుతోంది. అందులో ఉన్న ప్రమాదాలను గుర్తు చేస్తోంది. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఈ తరహా కార్యకలాపాలను గమనిస్తే వెంటనే తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×