E-Paper
Advertisement

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే
Advertisement

America: ఆ యంగ్ జంటకు అదొక థ్రిల్. తమ ప్రేమను ప్రపంచానికి బలంగా చాటాలనుకున్నారు. మనసులోని వచ్చిన ఆలోచనను ఓకే అమల్లోకి పెట్టారు. పీక్స్‌కు చేరింది.. అనుకోని సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఆ జంట పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

1454 అడుగుల ఎత్తైన టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌

Advertisement

అమెరికాలోని ఎంపైర్‌ స్టేట్‌ భవనంపైకి ఎక్కింది రష్యాకు చెందిన ఓ జంట. ఆ టవర్ ఎత్తు ఎంతో తెలుసా? 1454 అడుగుల ఎత్తు. భవనంపై ఉన్న ట్రాన్స్‌మిషన్‌ టవర్‌ శిఖరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఓ బ్యానర్‌ను ఆవిష్కరించి, తమ ప్రేమను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. అనంతరం యువకుడు.. సదరు యువతికి లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.

అందుకు ఆమె మనస్సాక్షిగా అంగీకరించింది. టవర్‌పై ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఆ తర్వాత ఆ పని కానిచ్చారు. ఆ జంట చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఈ వ్యవహారం చివరకు పోలీసుల దృష్టికి వెళ్లింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ జంటను అరెస్ట్ చేశారు.

Advertisement

అమెరికాలోని ఎంపైర్‌ స్టేట్‌ భవనం.. ఆ తర్వాత జంట అరెస్ట్

రష్యాకు చెందిన యంగ్ జంట ఏంజెలా నికోలౌ-వాన్యా బీర్కస్‌. ఇద్దరు ముఖాలకు మాస్కులు ధరించి, ఆపై టవర్‌పైకి ఎక్కారు. అంతేకాదు ఈ తతంగాన్ని ఆ జంట సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేసింది. టవర్‌ దిగువ ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్న తర్వాత వాన్యా.. మోకాలిపై కూర్చుని ఏంజెలాకు ప్రపోజ్‌ చేశాడు. ఆమె వెంటనే ఓకే చేయడంతో అక్కడే చిన్నపాటి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

ఈ సన్నివేశంతో అప్రమత్తమైన పోలీసులు.. భవనం అబ్జర్వేషన్‌ డెక్‌ను ఖాళీ చేయించారు. పరిసర ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసి, ఆ జంట కిందకు దిగిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అయితే టవర్‌పైకి వారు ఎలా ఎక్కారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

 

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×