E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ 16తో వచ్చేసిన Samsung Galaxy A27 5G.. ఏకంగా 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్!

ఆండ్రాయిడ్ 16తో వచ్చేసిన Samsung Galaxy A27 5G.. ఏకంగా 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్!
Advertisement

Samsung Galaxy A27 5G: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ గెలాక్సీ A-సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ A26 5G మోడల్‌కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా ‘శాంం‌సంగ్ గెలాక్సీ A27 5G’ని లాంచ్ చేసింది. అద్భుతమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో వస్తున్న ఈ హాండ్‌సెట్ జులై 3 నుంచి ఎంపిక చేసిన మార్కెట్లలో అమ్మకానికి రానుంది. ప్రస్తుతానికి దీని ధర, ఇండియా లాంచ్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, లైట్ పింక్ రంగుల్లో లభిస్తుంది.

ఈ కొత్త ఫోన్‌ను చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉండేలా కేవలం 7.8 mm స్లిమ్ బాడీతో రూపొందించారు. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను ఇచ్చారు. 120Hz రీఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. పంచ్-హోల్ డిజైన్ కెమెరా సైజును తగ్గించడం వల్ల స్క్రీన్ చూసేటప్పుడు ఎలాంటి అభ్యంతరం లేకుండా, ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది.

Advertisement

Also Read: ఇక ఫోన్ దొంగతనం చేస్తే దొంగలకే రిస్క్.. Kill Switchతో మొబైల్ ఎక్కడున్నా బ్లాక్ అయిపోద్ది!

ఈ Samsung Galaxy A27 5G ఫోన్ పనితీరు కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 6GB+128GB, 8GB+128GB, 8GB+256GB వేరియంట్లలో లభిస్తుంది. మెమొరీని పెంచుకోవడానికి 2TB వరకు మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంది. కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు OIS సపోర్ట్ ఉన్న 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను అందించారు.

Advertisement

ఇందులో 5000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ Samsung Galaxy A27 5Gకు ఏకంగా ఆరేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.

ఇకపోతే ఈ ఫోన్‌లో సరికొత్త AI ఫీచర్లను చేర్చారు. గూగుల్ ‘సర్కిల్ టు సెర్చ్’ ఇప్పుడు ఒకేసారి ఎక్కువ వస్తువులను గుర్తిస్తుంది. అలాగే ఫొటోల నుంచి వద్దు అనుకున్న వాటిని తీసేయడానికి ‘ఆబ్జెక్ట్ ఎరేజర్’ ఉంది. వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ 22 భాషల్లో అనువాదానికి సపోర్ట్ చేస్తుంది. గూగుల్ జెమిని, పర్‌ప్లెక్సిటీ, బిక్స్బీ వంటి మల్టిపుల్ AI అసిస్టెంట్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం శాంసంగ్ నాక్స్ వాల్ట్, ధూళి, నీటి నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ఇచ్చారు.

Also Read: రూ.35 వేల బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ లాంటి టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×