E-Paper
Advertisement

గోల్డ్ షాప్‌లోకి చొరబడి.. పెప్పర్ స్ప్రే కొట్టి.. యువతులు వీరంగం!

గోల్డ్ షాప్‌లోకి చొరబడి.. పెప్పర్ స్ప్రే కొట్టి.. యువతులు వీరంగం!
Advertisement

Patna Robbery: బిహార్ రాజధాని పాట్నాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు పెప్పర్ స్ప్రేను ఉపయోగించి.. షాపులో నగలు దోచుకెళ్లడానికి ప్రయత్నించారు. షాపు యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో వారు అడ్డంగా బుక్కయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పాట్నాలోని దిగా ప్రాంతంలో గల నగల దుకాణానికి మాస్కులు ధరించిన ఇద్దరు యువతులు వెళ్లారు. యజమానితో గోల్డ్ చూపిస్తుండగా.. వారిలో ఒక యువతి ఒక్కసారిగా పెప్పర్ స్ప్రేను బయటకు తీసింది. దానిని యజమాని ముఖంపై కొట్టి.. బంగారంతో పారిపోవాలని భావించారు. అయితే యజమాని చాకచక్యంగా వ్యవహరించి.. బిగ్గరగా కేకలు వేశాడు. బయటకు వెళ్లి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. దీంతో తప్పించుకునే అవకాశం లేక.. యువతులు షాపులోనే ఉండిపోయారు.

Advertisement

Also Read: చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి

Advertisement

ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 5.35 గం.ల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. షాపులోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఇద్దరు యువతులపై షాపు యజమాని ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇలాంటి దొంగతనాలకు ఏమైనా పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన పెప్పర్ స్ప్రేను ఇలా దోపిడికి ఉపయోగించడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Also Read: భర్తతో విడిపోయిన తర్వాత దారుణమైన ట్రోల్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బాలీవుడ్ బ్యూటీ!

Related News

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

Big Stories

Advertisement
×