E-Paper
Advertisement

తలనొప్పితో జీవితం నరకంగా మారిందా? ఆ ఒక్క పొరపాటే ముఖ్య కారణం!

తలనొప్పితో జీవితం నరకంగా మారిందా? ఆ ఒక్క పొరపాటే ముఖ్య కారణం!
Advertisement

How to cure headache naturally: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రకమైన ఒత్తిడి. దీనికి తోడు సమయానికి తినకపోవడం, నిద్రలేమి. ఫలితం.. భరించలేని ‘తలనొప్పి’. నేటి కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధించే అతిపెద్ద సమస్య ఇది. తల నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేం, జీవితమే విసుగ్గా అనిపిస్తుంది. చాలా మంది దీని కోసం వెంటనే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ.. అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుని, కొన్ని సింపుల్ నివారణ పద్ధతులు పాటిస్తే మందులతో పని లేకుండానే దీనికి సులభంగా చెక్ పెట్టవచ్చు.

తలనొప్పికి కారణాలు :
నిపుణుల ప్రకారం.. తలనొప్పి అనేది ఒక స్వతంత్ర వ్యాధి కాదు. అది మన శరీరంలో జరుగుతున్న ఏదో ఒక మార్పుకు లేదా సమస్యకు ఒక సంకేతం మాత్రమే. ఎక్కువ శాతం తల నొప్పులు మన లైఫ్‌స్టైల్ లోని లోపాల వల్లే వస్తుంటాయి.

Advertisement

తలనొప్పి రావడానికి ప్రధాన కారణాలు:
1. డీహైడ్రేషన్ : శరీరంలో నీటి శాతం తగ్గడం తలనొప్పికి అత్యంత సాధారణ కారణం. మన మెదడుకు సరిపడా డ్రింక్స్  అందనప్పుడు తల గుంజడం లేదా నొప్పి రావడం జరుగుతుంది.

2. స్క్రీన్ టైమ్ , కంటి ఒత్తిడి: గంటల తరబడి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు చూడటం వల్ల కంటి కండరాలు అలసిపోయి తీవ్రమైన తలనొప్పి వస్తుంది.

Advertisement

3. నిద్రలేమి: రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పర్ఫెక్ట్ నిద్ర లేకపోతే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, మరుసటి రోజు ఉదయం నుండే తల భారంగా మారుతుంది.

4. గ్యాస్ట్రిక్ , ఎసిడిటీ: అవును, కడుపులో గ్యాస్ ఫామ్ అయినా లేదా సమయానికి భోజనం చేయకపోయినా ఆ ఎఫెక్ట్ నేరుగా మెదడుపై పడి తలనొప్పికి దారితీస్తుంది.

5. మానసిక ఒత్తిడి : ఆఫీస్ వర్క్, వ్యక్తిగత సమస్యల వల్ల వచ్చే మితి మీరిన ఆందోళన మెదడులోని నరాలను బిగుసుకుపోయేలా చేస్తుంది.

తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం:
పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు తరచూ వాడటం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. కాబట్టి.. సహజ పద్ధతుల్లో తలనొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం టీ:
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తలలోని రక్తనాళాల వాపును తగ్గించి నొప్పిని నివారిస్తుంది. తలనొప్పిగా అనిపించినప్పుడు ఒక కప్పు వేడి అల్లం టీ తాగడం వల్ల మైగ్రెయిన్ నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

పుదీనా ఆయిల్ మసాజ్ :
పుదీనా నూనెలో ఉండే మెంథాల్ నరాలకు విశ్రాంతిని ఇస్తుంది. రెండు చుక్కల పుదీనా ఆయిల్‌ను నుదిటిపై, కణతలపై రాసి కాసేపు మృదువుగా మసాజ్ చేస్తే నిమిషాల్లో నొప్పి మాయమవుతుంది.

డీప్ బ్రీతింగ్ మెడిటేషన్:
ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పికి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఐదు నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవడం మంచి మందులా పనిచేస్తుంది. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.

ధారాళంగా నీరు తాగడం:
తలనొప్పి రాగానే ముందుగా ఒక పెద్ద గ్లాసు నీరు తాగండి. ఎక్కువ శాతం మందికి నీరు తాగిన అరగంటలోనే తలనొప్పి తగ్గిపోవడం గమనార్హం.

ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?
సాధారణ తలనొప్పులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ, తలనొప్పితో పాటు వాంతులు అవ్వడం, కంటిచూపు మసకబారడం, జ్వరం రావడం లేదా ఒకే వైపు విపరీతమైన నొప్పి వారాల తరబడి వేధిస్తుంటే.. మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

తలనొప్పి మీ రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెట్టకూడదంటే.. రోజుకు 3 లీటర్ల నీరు తాగడం, సరైన సమయానికి నిద్రపోవడం, టీవీ/మొబైల్ స్క్రీన్ చూసేటప్పుడు మధ్య మధ్యలో విరామం ఇవ్వడం అలవాటు చేసుకోండి. మందు బిళ్ళలపై ఆధారపడటం తగ్గించి.. ఈ సహజమైన చిట్కాలతో మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×