E-Paper
Advertisement

షాకింగ్ ఫీచర్లు.. అమేజ్‌ఫిట్ నుంచి ఒకేసారి 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధరలు ఇవే!

షాకింగ్ ఫీచర్లు.. అమేజ్‌ఫిట్ నుంచి ఒకేసారి 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధరలు ఇవే!
Advertisement

Amazfit Smartwatches: ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ అమేజ్‌ఫిట్ భారత మార్కెట్లోకి ఒకేసారి మూడు సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. రన్నర్లు, అథ్లెట్లతో పాటు సాధారణ ఫిట్‌నెస్ ప్రియులను ఆకట్టుకునేలా Amazfit Cheetah 2 Pro, Cheetah 2 Ultra, Bip Max మోడళ్లను తీసుకొచ్చింది. జీప్ ఓఎస్‌పై పనిచేసే ఈ వాచ్‌లు అద్భుతమైన బ్యాటరీ లైఫ్, అధునాతన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో లభిస్తున్నాయి.

అందరికీ అందుబాటులో బిప్ మ్యాక్స్:

ఈ సిరీస్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే మోడల్ Amazfit Bip Max. దీని ధర రూ.10,999గా ఉంది. ఇది కేవలం సిల్వర్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది. తక్కువ ధరలో బ్లూటూత్ కాలింగ్, జీపీఎస్, పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్. దీనిలో 2.07 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంతో 20 రోజుల పాటు ఈ వాచ్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.

రన్నర్ల కోసం Cheetah 2 Pro:

Advertisement

రన్నింగ్, అథ్లెటిక్స్‌పై ఆసక్తి ఉన్నవారి కోసం Amazfit Cheetah 2 Pro మోడల్‌ను రూపొందించారు. దీని ధర రూ.41,999 కాగా, ఇది ప్రీమియం టైటానియం ఫినిషింగ్‌తో లభిస్తుంది. దీనిలో 1.32 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు స్క్రీన్ స్క్రాచ్ అవ్వకుండా సఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. పాటలు, మ్యాప్స్ కోసం 32GB స్టోరేజ్ ఉంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ చూపే బయోట్రాకర్ 6.0 సెన్సార్‌ ఇందులో ప్రత్యేక ఆకర్షణ. దీని బ్యాటరీ 20 రోజుల వరకు నిలుస్తుంది.

Also Read: వాట్సప్ యూజర్స్‌కు అలర్ట్.. ఫార్వర్డ్ మెసేజ్‌లపై ఈ లేబుల్ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి!

అడ్వెంచర్ ప్రియులకు Cheetah 2 Ultra:

Advertisement

ట్రెయిలింగ్, కఠినమైన ప్రదేశాల్లో ప్రయాణించే వారి కోసం Cheetah 2 Ultra మోడల్ అద్భుతంగా పనిచేస్తుంది. దీని ధర రూ.54,999. టైటానియం బెజెల్, బ్లాక్ సిలికాన్ స్ట్రాప్‌తో ఇది లభిస్తుంది. దీనిలో 1.5 ఇంచుల పెద్ద డిస్‌ప్లే, ఏకంగా 64GB స్టోరేజ్ ఇచ్చారు. ఈ వాచ్‌లో ఉండే ఆఫ్‌లైన్ టోపోగ్రాఫిక్ మ్యాప్స్, ఆటోమేటిక్ రూట్ చేంజ్ వంటి ఫీచర్లు దారి తప్పిపోకుండా కాపాడతాయి. ఇందులో వైట్, రెడ్, ఎస్ఓఎస్ మోడ్స్ ఉన్న ఫ్లాష్‌లైట్ కూడా ఉంది.

అదిరిపోయే బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు:

Cheetah 2 Ultra బ్యాటరీ పరంగా సూపర్ అనిపిస్తుంది. సాధారణంగా వాడితే ఇది ఏకంగా 30 రోజుల పాటు ఛార్జింగ్ వస్తుంది. జీపీఎస్ ఆన్ చేసి ఉంచినా 60 గంటల పాటు బ్యాకప్ ఇస్తుంది. ఈ రెండు చీతా సిరీస్ వాచ్‌లలో అలెక్సా వాయిస్ కంట్రోల్, బ్లూటూత్ కాలింగ్, వందకు పైగా వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి. బాడీ రికవరీ ఇన్సైట్స్, రన్నింగ్ పవర్ వంటి స్పోర్ట్స్ అనలిటిక్స్ కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ఈ మూడు స్మార్ట్‌వాచ్‌లు ప్రస్తుతం అమేజ్‌ఫిట్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ వేదికగా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

Also Read: Samsung Galaxy S26 ఫోన్‌కు One UI 9 అప్‌డేట్ విడుదల.. కొత్త AI ఫీచర్లు, కీలక మార్పులు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×