E-Paper
Advertisement

Fire Accident: SVS కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

Fire Accident: SVS కెమికల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
Advertisement

Fire Accident:  అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న SVS కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని రియాక్టర్లు ఒక్కసారిగి పేలడంతో మంటలు భారీస్థాయిలో ఎగసిపడ్డాయి. ఈ ప్రమాద ధాటికి ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. రియాక్టర్లు పేలిన అనంతరం అక్కడే నిల్వ ఉంచిన సాల్వెంట్ ఆయిల్ డ్రమ్ములు వరుసగా పేలడం ప్రారంభించాయి. ఆయిల్ డ్రమ్ములు పేలుతుండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు ఉధృత్తికి ఫ్యాక్టరీ పైకప్పులు, యంత్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ ప్రమాద సమాాచారం అందిన వెంటనే 6 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో చిక్కుకున్న 16 మంది కార్మికులను ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, కార్మికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పరడాల డీఎస్పీ విష్ణు స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 16 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నారని.. మంటలు ఆర్పే ప్రక్రియ కొనసాగుతోందని.. ఆస్తి నష్టం ఎంత అనే దానిపై అంచనా వేస్తున్నామని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్నీ కోణాలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ.. గాలిలో కెమికల్ పొగలు వ్యాపించిడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisement

ALSO READ: Hyderabad News: ఏటీఎంలో హెల్ప్ చేస్తారు.. కార్డులు మార్చేసి దోచేస్తారు, నగరంలో కొత్త దందా!

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×