E-Paper
Advertisement

The Raja Saab: రాజా సాబ్ నాన్నమ్మగా జరీనా వహబ్ ఫస్ట్ ఛాయిస్ కాదా.. ప్రభాస్ అలా అన్నారా?

The Raja Saab: రాజా సాబ్ నాన్నమ్మగా జరీనా వహబ్ ఫస్ట్ ఛాయిస్ కాదా.. ప్రభాస్ అలా అన్నారా?
Advertisement

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab). డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హీరోయిన్లతో పాటు డైరెక్టర్ మారుతి కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి నటి జరీనా వహబ్(Zarina Wahab ) పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

హేమామాలిని ఫస్ట్ ఛాయిస్..

ఈ సినిమాలో నటి జరీనా ప్రభాస్ నానమ్మ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొత్తం ప్రభాస్, జరీనా మధ్య కొనసాగుతుందని, ఇది నానమ్మ మనవడి కథ అంటూ స్వయంగా ప్రభాస్ తెలియజేశారు. ఇక తాజాగా ఈమె పాత్ర గురించి మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో జరీనా గారు మొదటి ఎంపిక కాదని తెలిపారు. ముందు ఈ పాత్రలో నటించడం కోసం సీనియర్ నటి హేమమాలిని(Hema Malini) గారిని సంప్రదించాము. ఈ పాత్రలో నటించడం కోసం ఆమె కూడా ఒప్పుకున్నారు అయితే ఈ సినిమా కథకు ఈమె సరిగ్గా సూట్ అవ్వరని అనిపించింది అందుకే తదుపరి జరీనా గారిని అప్రోచ్ అయ్యామని మారుతి తెలిపారు.

జరీనా గారికి లైఫ్ టైం సినిమా..

Advertisement

జరీనా విరాటపర్వం సినిమాలో నటించిన ఒక క్లిప్ ప్రభాస్ గారికి పంపించాను. అది చూసిన తర్వాత ప్రభాస్ గారు ఈమె అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఈమెను తీసుకోవడం బెటర్ అంటూ సలహా ఇచ్చారని మారుతి తెలిపారు. దీంతో జరీనా గారిని ఫైనల్ చేశామని మారుతి తెలియజేశారు. ఇక ఈ సినిమా మొత్తం సంజయ్ దత్ జరీనా ప్రభాస్ గారి మధ్యనే కొనసాగుతుందని ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈ ముగ్గురి పాత్రలను మైండ్ లోకి పెట్టుకొని బయటకు వెళ్తారు అంటూ మారుతి తెలిపారు. జరీనా వాహబ్ గారికి ఇది లైఫ్ టైం సినిమా అంటూ మారుతి తెలిపారు.

హర్రర్ కామెడీ నేపథ్యంలో..

Advertisement

ఇలా ఈమె పాత్ర గురించి మారుతి అంచనాలు పెంచేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ను ఇది వరకు చూడని విధంగా ఈ సినిమాలో చూడబోతున్నారని, కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని మారుతి తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. మాళవిక మోహనన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Also Read: Lenin First Single:  ‘వవారెవ్వా..వారెవ్వా’ అదిరిపోయిన అఖిల్ ఫస్ట్ సింగిల్ ప్రోమో..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×