E-Paper
Advertisement

అప్పుచేసి డబ్బులిచ్చాను.. అషురెడ్డి మోసం పై ధర్మేంద్ర ఆవేదన…

అప్పుచేసి డబ్బులిచ్చాను.. అషురెడ్డి మోసం పై ధర్మేంద్ర ఆవేదన…
Advertisement

Dharmendra Ashu Reddy: అషురెడ్డి గత నాలుగు రోజులుగా ధర్మేంద్ర వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటాను అంటూ ఆయన వద్ద నుంచి 9.35 కోట్ల రూపాయలను తీసుకొని తనని మోసం చేసింది అంటూ ధర్మేంద్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయటంతో ఈయన పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై పోలీసులు కేసు కూడా నమోదు చేయడంతో ఈ విషయం కాస్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది. ఇలా ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే అషురెడ్డికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఏడాది నుంచి కొనసాగుతున్న వివాదం..

ఇందులో భాగంగా ఈమె ధర్మేంద్రను బెదిరించడం మనం వినొచ్చు. తాను జీవితంలో సెటిల్ అయిన తర్వాత నీ డబ్బు మొత్తం నీకు తిరిగి ఇస్తాను మే నెలలోకి కేవలం ఒకటిన్నర కోటి మాత్రమే ఇస్తానని ఆ తర్వాత తనని డబ్బు కోసం విసిగిస్తే కేసు పెడతాను అంటూ ఈమె ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తున్నటువంటి ఒక ఆడియో లీక్ అయ్యింది. ఈ ఆడియో క్లిప్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ధర్మేంద్ర స్పందించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర స్పందిస్తూ అషురెడ్డితో ఈ వివాదం గత ఏడాది కాలం పాటు కొనసాగుతుంది కానీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందో తెలియదని తెలిపారు.

బంగారం ,ఇల్లు కొనిచ్చాను..

Advertisement

గత రెండు సంవత్సరాలుగా తనకు అషురెడ్డితో పరిచయం ఉంది ఆమె తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె అడిగినవన్నీ కూడా అప్పు చేసి మరి కొనిచ్చాను. అషురెడ్డి కోసం తాను బంగారంతో పాటు ఒక ఇల్లు కూడా కొనిచ్చానని అయితే తన అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి మాట మార్చేసిందని తెలిపారు. తనని పెళ్లి చేసుకోనని చెప్పడంతో తాను కూడా తనకోసం ఖర్చుపెట్టిన డబ్బులను తిరిగి ఇచ్చేయమని అడిగినప్పుడు ఆమె ఎదురు తిరిగిందని ధర్మేంద్ర ఆవేదన చెందారు.

బ్యాంక్ లోన్ తీసుకున్నాను..

Advertisement

అషురెడ్డి కోసం తన వద్ద ఉన్న డబ్బులన్ని ఖర్చు చేయడమే కాకుండా బ్యాంకులో లోన్ తీసుకోవటమే కాకుండా తెలిసిన వారి దగ్గర కూడా అప్పు తీసుకున్నానని తెలిపారు. ఇప్పుడు తన డబ్బు తనకు వెనక్కి ఇవ్వమంటే మా తండ్రి పై కేసు పెడతానని మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టింది అందుకే తాను పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టానని ఈ విషయంలో చట్టపరంగానే ముందుకు వెళ్తానని తెలిపారు. అయితే ఈ విషయంపై పోలీసుల పక్క ఆధారాలను సేకరించిన తర్వాతనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారని ధర్మేంద్ర తెలిపారు. ఈ విషయంలో అషు రెడ్డి స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు. అదేవిధంగా ఆడియో బయటపడటంతో ఈమె నిజంగానే మోసం చేసిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఆడియో లీక్ పై ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆశు రెడ్డి స్పందించలేదు.

Also Read: రెండో పెళ్లి తర్వాత సమంత ఫస్ట్ బర్త్ డే..బెస్ట్ బర్త్ డే అంటూ సామ్ పోస్ట్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×