E-Paper
Advertisement

Nakshatra – Women: ఈ ఐదు నక్షత్రాల్లో పుట్టిన మహిళలు ఎప్పటికైనా చరిత్ర సృష్టిస్తారట – అందులో మీ నక్షత్రం ఉందేమో తెలుసుకోండి

Nakshatra – Women: ఈ ఐదు నక్షత్రాల్లో పుట్టిన మహిళలు ఎప్పటికైనా చరిత్ర సృష్టిస్తారట – అందులో మీ నక్షత్రం ఉందేమో తెలుసుకోండి
Advertisement

Nakshatra – Women: ఆ అయిదు నక్షత్రాల్లో పుట్టిన మహిళలు ఎప్పటికైనా చరిత్ర సృష్టిస్తారట. వారు ఎంచుకున్న రంగంలో వారికి  తిరుగే  ఉండదట. అయితే ఇప్పటి వరకు చరిత్రలో గొప్ప వ్యక్తులుగా ఎదిగిన మహిళలు కూడా ఎక్కువగా ఆ నక్షత్రాల్లోనే పుట్టారట.  ఇంతకీ ఆ నక్షత్రాలు ఏవీ అందులో పుట్టిన మహిళల ప్రత్యేక ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన మహిళలు ఎప్పటికైనా  గొప్పవారు అవుతారట. వారికి జీవితంలో ఎదురే ఉండదట.  ఎటువంటి సమస్యనైనా తమకున్న శక్తి సామర్థ్యాలతో పరిష్కరిస్తారట. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందే మహిళలందరూ కూడా అవే నక్షత్రాల్లో పుట్టి ఉంటారనేది జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఆ నక్షత్రాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అశ్విని నక్షత్రం:  ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలు స్వతంత్ర భావజాలం ఎక్కువగా ఉంటుంది. బలమైన సంకల్పం కలిగి ఉంటారు. వీరు అత్యవసర సమయంలోనైనా సరే వేగవంతమైన ఆలోచనలు చేయగలరు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడూ అందరి కంటే ముందే ఉండాలని బలంగా కోరుకుంటారు. ఈ నక్షత్ర జాతకులు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వీరే ముందుంటారు.

భరణి నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులకు శుక్రుడి ఆశీస్సులు నిండుగా ఉంటాయి. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలు అందాన్ని మాత్రమే కాదు అసాధారణమైన ఆత్మగౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. బయటకు సున్నితంగా కనిపించినా లోపల శక్తివంతమైన ధృడత్వం కలిగి ఉంటారు. అయితే ఈ నక్షత్రంలో పుట్టిన చాలా మంది మహిళలు నిబంధనలు అసలు పాటించరు. కానీ కొత్త నిబంధనలు సృష్టించడంలో వీరు సిద్ద హస్తులు.

Advertisement

మఖా నక్షత్రం:  ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలకు కేతు గ్రహ ప్రభావంతో  సహజమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరిలో పరిపక్వత అధికంగా ఉంటుంది. వీరికి మూలాల నుంచే కీర్తి వస్తుంది. రిలేషన్స్‌లో రెస్పెక్ట్‌ లేకపోతే అసలు సహించారు ఆ రిలేషన్స్ వదులుకోవడానికి కూడా వెనకాడరు. సమయ పాలన పాటిస్తారు. విలువ ఉన్న చోటే వీరు ఉంటారు.

స్వాతి నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులకు వాయుదేవుని ఆశీస్సులు ఉంటాయి. దీని కారణంగా ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన మహిళలకు స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీరి చాలా సౌమ్యంగా ఉంటారు. ఏదైనా విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు ముందుంటారు. మారే గాలిలా వీరు తమ జీవితాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తే అది వారి దారినే మార్చేస్తుంది. అయితే వీరి దిశను ఎవ్వరూ నిర్ణయించలేరు.

మూల నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులకు నిర్బతి దేవత ఆశీర్వాతం ఉంటుంది. వీరికి  లోతైన ఆలోచనా శక్తి ఉంటుంది. మూలా నక్షత్ర జాతక మహిళలు సత్యం కోసం అన్వేషిస్తారు. అబద్దాలు చెప్పడం వీరికి చేతకాదు. రిలేషన్స్ పెరగడానికి వీరు కృషి చేస్తారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడే రకం కాదు వీరు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×