E-Paper
Advertisement

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లో ఊహించని ట్విస్ట్.. జడ్జీలలో భారీ మార్పు!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లో ఊహించని ట్విస్ట్.. జడ్జీలలో భారీ మార్పు!
Advertisement

Bigg Boss:ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ఈ బిగ్ బాస్ కార్యక్రమం పై విమర్శలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏది ఏమైనా ఎవరు ఏమన్నా సరే ఎంతోమంది సెలబ్రిటీలకే కాదు అటు కామన్ పీపుల్స్ కి కూడా ఈ షో ఊహించని పాపులారిటీని అందించి పెడుతోంది. ఇకపోతే ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తి కాగా , ఇప్పుడు 10వ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. “బిగ్ బాస్ దశావతారం” అంటూ ప్రారంభం కాబోతున్న ఈ సీజన్ లో కామన్ కేటగిరీలో 8మంది సామాన్యులు హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. అయితే ఆ 8మందిని ఎంపిక చేయడానికి మునుపటి సీజన్ లాగే ఈసారి కూడా అగ్నిపరీక్ష సీజన్ 2 నిర్వహించి.. ఈ సీజన్లో నెగ్గిన 8 మందిని హౌస్ లోకి పంపించబోతున్నట్లు సమాచారం.

అగ్ని పరీక్ష సీజన్ 2 జడ్జెస్ విషయంలో కొత్త న్యూస్..

వాస్తవానికి బిగ్ బాస్ సీజన్ 9 అంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం అగ్నిపరీక్ష .. ఈ షో ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల, మాస్క్ మ్యాన్ హరీష్, దివ్యా నిఖిత, ప్రియ రావు, దమ్ము శ్రీజ , డెమోన్ పవన్ వంటి వారు ఇచ్చిన కంటెంట్ మాముల్ది కాదు.. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సామాన్యుల వల్లే షో రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అందుకే ఈ సీజన్ కి కూడా మళ్లీ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ఎంచుకున్నారు. అయితే ఈసారి జడ్జిల విషయంలో మరో కొత్త వార్త తెరపైకి వచ్చింది. శివాజీ, గీతా మాధురి వంటి వారు వ్యవహరిస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగినా.. అందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

స్పెషల్ ప్రోమో అప్పుడే..

Advertisement

గత సీజన్లో అగ్నిపరీక్షకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన అభిజిత్, నవదీప్, బిందు మాధవిలే ఈ సీజన్ కి కూడా జడ్జిలుగా వ్యవహరించబోతున్నారట. పైగా వచ్చేవారం ఈ ముగ్గురిపై స్పెషల్ ప్రోమోను షూట్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈనెల 27 నుండి అగ్ని పరీక్ష అంటూ షూటింగ్ మొదలు కాగా.. ఆగస్టు 11 లేదా 13 నుండి ఈ షో జియో హాట్ స్టార్, స్టార్ మా చానల్లో టెలికాస్ట్ చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ షో ఏకంగా 16 ఎపిసోడ్లు ఉంటుందని సమాచారం.

also read:ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన కాజల్.. కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం?

ఆ రేంజ్ రెస్పాన్స్ లభించట్లేదే?

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు గత సీజన్లో సామాన్యులే టైటిల్ విన్నర్ గా నిలవడంతో ఈ సీజన్ కి కూడా దరఖాస్తులు లక్షల్లో వస్తాయని నిర్వాహకులు ఊహించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఇప్పటివరకు 25వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయట . ఇక ఈ విషయంలో మేకర్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ షో కి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. పైగా దశావతారం పేరిట ఈ సీజన్లో చాలా కఠినమైన టాస్కులు నిర్వహించబోతున్నారని, కంటెస్టెంట్స్ తరఫున మెంటార్ కూడా ఉంటారనే వార్తలు రావడంతోనే.. కాస్త సామాన్యులు వెనక్కి తగ్గారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజం ఉందో తెలియదు కానీ ఈసారి అగ్ని పరీక్ష ద్వారా ప్రేక్షకులను మెప్పించి జడ్జెస్ మెప్పు పొంది హౌస్ లోకి ఎవరు అడుగుపెడతారో చూడాలి. మరొకవైపు 14 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×