E-Paper
Advertisement

Priyanka Jain – Siva : ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక.. పెళ్లి డేట్ ఫిక్స్..?

Priyanka Jain – Siva : ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక.. పెళ్లి డేట్ ఫిక్స్..?
Advertisement

Priyanka Jain – Shiva : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రియాంక జైన్.. మోడల్గా తన కెరీయర్ని మొదలుపెట్టి నటిగా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది.. అయితే బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి సందడి చేసింది.. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్ తో కలిసి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ బిజీగా ఉంది.. ఇకపోతే ఈమధ్య ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అటు శివకుమార్ బిగ్ టీవీ కిస్సిక్ టాక్ లో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో పెళ్లి గురించి ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం..

ప్రియాంక జైన్ – శివకుమార్ పెళ్లి డేట్ ఫిక్స్..?

బిగ్ బాస్ బ్యూటి ప్రియాంక జైన్ పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపించాయి.. ఆ వార్తలకు చెక్ పెడుతూ ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ప్రియాంక జైన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియోని షేర్ చేసింది.. ఆ వీడియోలు ప్రియాంక అలాగే శివకుమార్ ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తారు.. ఇక మెహందీ హల్దీ అంటూ అన్ని ఒకసారి అలా కనిపిస్తాయి.. అంతే కాదు ఆ ఫంక్షన్ జరుగుతున్న ప్లేసులో యువర్ ఇన్వైటెడ్ శివకుమార్, ప్రియాంక జైన్ జూలై 2న అని ఉంటుంది.. ఆ వీడియోకి ఏడేళ్ల పాటు కలిసి ప్రయాణం చేసాము.. ఇక సర్ప్రైజ్ రీవిల్ అంటూ ట్యాగ్ చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఇది చూసిన నెటిజెన్లు అలాగే అభిమానులు వీళ్ళిద్దరూ జూలై 2 న పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి ఈ జంట ఇన్నేళ్లకు పెళ్లి పెట్టలేక పోతుంది.. ఈ వీడియోని చూసిన సెలబ్రిటీలు వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. మరి వీళ్ళ పెళ్లికి ఎవరు గెస్ట్లుగా రాబోతున్నారు అన్నది త్వరలోనే తెలిసే అవకాశం కూడా ఉంది..

Advertisement

Also Read:Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు పోలీస్ స్టేషన్ లో అవమానం.. అరుణ్ కు మైండ్ బ్లాక్.. మీనాకు ఝలక్..

ప్రియాంక – శివ లవ్ స్టోరీ..

సీరియల్ నటి ప్రియాంక జైన్, నటుడు శివకుమార్ ఇద్దరూ కలిసి మౌనరాగం అనే సీరియల్ లో నటించారు.. వీరిద్దరికీ అదే మొదటి సీరియల్.. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఏడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు.. వీరిద్దరూ కలిసే ఎక్కడికైనా వెళ్తారు.. అంతేకాదు వీళ్ళ ఫోటో షూట్ లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల శివకుమార్ బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ కు గెస్ట్ గా వచ్చారు.. అందులో భాగంగా ఆయన తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఏడాదిలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నామని హింట్ ఇచ్చాడు.. మొత్తానికి పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నందుకు వీళ్ళ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.. ఇప్పటికే ఈ వీడియోని చూసిన సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు.. మరి ఎల్లుండి జరగబోతున్న ఈ పెళ్లికి ఎవరెవరు గెస్ట్లుగా రాబోతున్నారు అన్నది చూడాలి..

Advertisement

?igsh=MjMwNTY2YXk1Znhk

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×