E-Paper
Advertisement

Varalaxmi Sarathkumar: వరలక్ష్మిలోని ఈ యాంగిల్ తెలుసా? విజయ్ పాలిటిక్స్‌పై ఒక్కటే మాట!

Varalaxmi Sarathkumar: వరలక్ష్మిలోని ఈ యాంగిల్ తెలుసా? విజయ్ పాలిటిక్స్‌పై ఒక్కటే మాట!
Advertisement

Varalaxmi Sarathkumar: సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi SarathKumar) పేరు అందరికీ పరిచయమే. ప్రస్తుతం ఆమె నటిగానే కాకుండా, దర్శకురాలిగా కూడా ‘సరస్వతి’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం విడుదలై థియేటర్లలో సక్సె‌స్‌పుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో ఆమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్ని, అనేక విషయాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకేం ప్రాపర్టీస్ లేవు. ప్రస్తుతం రెంట్‌కే ఉంటున్నాను. నేను సొంతంగా సంపాదించి ఒక కారు కొనుక్కున్నాను. ఈ మధ్యే చిన్న ఇల్లు ఒకటి కొనుక్కున్నాను. నిజంగా నాకు ప్రాపర్టీస్ ఉంటే, ఇంకా ఇక్కడెందుకు ఉంటాను. నాకు ఆస్తులేం లేవు. కేవలం అభిమానుల ప్రేమ మాత్రమే నా ఆస్తి.

Also Read- Big TV Kissik Talks: 70 ఏళ్ల వాళ్లకి ఎందుకు పాలిటిక్స్?.. నేను రాజకీయాల్లోకి వస్తా!- వరు

బొకే, శాలువలు నాకు ఇవ్వకండి

Advertisement

నేను నా బర్త్‌డే ప్రతి సంవత్సరం చాలా సింపుల్‌గా జరుపుకుంటాను. ప్రతి బర్త్‌డేకు ఏదో ఒక సర్వీస్ చేస్తాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న హాస్పిటల్‌కి వెళ్లడం ఇలాంటివి చేస్తాను. నేను పది రూపాయలు సంపాదిస్తే.. అందులో 50 శాతం చారిటీకి వినియోగిస్తా. ఏదో ఒకటి.. ఒకరికి హెల్ప్ చేస్తే, అంటే నా దగ్గర ఎంత ఉందో, అందులో నుంచి కొంత అయితే హెల్ప్ చేయడానికి కచ్చితంగా వాడతాను. యానిమల్స్ కోసం, అనాథల కోసం ఇలా ఏదో ఒకటి చేస్తాను. లాస్ట్ టైమ్ అనాథ పిల్లలకు షూ కావాలని అడిగారు. షూ కొనడం కాదు, వారిని షాపింగ్‌కు తీసికెళ్లి వారికి ఏం కావాలో కొనివ్వాలని అనుకున్నాను. అందరినీ తీసుకెళ్లి, వారికి ఏం కావాలో అది కొనిచ్చాను. వాళ్లు పొందిన ఆనందం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు బొకే ఇస్తుంటారు. అది ఇవ్వవద్దు, దానికి ఎంత ఖర్చు పెడుతున్నారో, అంత ఏదైనా ఆశ్రమానికి ఇచ్చి, నాకు కూపన్ ఇవ్వండి.. చాలా హ్యాపీగా ఫీలవుతానని చెబుతాను. బొకే, శాలువలు ఇస్తే ఏం చేస్తాం.. తీసుకుని పక్కన పడేస్తాం అంతేగా. అందుకే అలా చేయమని చెబుతుంటాను.

Also Read- Konidela Surekha: మెగా ఫ్యామిలీని నేను మేనేజ్ చేస్తాను అనుకుంటారు.. కానీ నిజం ఏమిటంటే.. సురేఖ కీలక వ్యాఖ్యలు

ఒక్కటే మాట..

Advertisement

నేను నటి నుంచి డైరెక్షన్ వైపు ఎలా వచ్చానో.. విజయ్‌ (Kollywood Hero Vijay)ది కూడా అదొక జర్నీ. హీరో నుంచి పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైనా సరే, ప్రజలకు మంచి చేస్తే హ్యాపీ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక.. మేము చేసేది బయట చెప్తేనే చేసినట్లుగా కాదు. ఎవరికీ తెలియకుండా చాలా చేస్తాం. ఇంట్లో ఉండే వాళ్లకి హెల్ప్ చేసినా అది హెల్పే కదా. అంతేకానీ, బయటకి వెళ్లి చేస్తేనే హెల్ప్ కాదు. మన చుట్టూ ఉన్న వాళ్లకి చేసినా అది హెల్పే. విజయ్ అని మాత్రమే కాదు, నాకు అందరి దగ్గర మంచి ఎఫెక్షన్ ఉంది. నేను వర్క్ చేసిన వారందరూ నన్ను ఎంతగానో అభిమానిస్తారు. విజయ్‌కి ఒక్క మాట చెప్పాలంటే.. ‘ఆల్ ది వెరీ బెస్ట్ సార్’ అని చెబుతాను..’’ అని వరలక్ష్మి విజయ్ పాలిటిక్స్‌పై మాట్లాడారు.

Also Read- Big Tv Kissik Talks: తమిళ ఇండస్ట్రీ నన్ను వాడుకోలేదు.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×